వివాదాలలో అచ్యుత రామయ్య

Submitted by ganesh on Thu, 11/08/2018 - 20:41
వివాదాలలో అచ్యుత రామయ్య

                    ఏళ్ల తరబడి ఒకే చోట పాతుకుపోయాడు.  పోనీ విధులైనా సరిగ్గా చేస్తాడా అంటే అదీలేదు.. నోటి దురుసుతో ఎప్పుడూ వార్తల్లోనే ఉండేవాడు.. అది చాలదన్నట్టు ఇటీవల జరిగిన దసరా ఉత్సవాల్లో అందినకాడికి మెక్కేశాడు. అక్రమాలను ప్రశ్నిస్తే ఉన్నతాధికారినే బెదిరించాడు.  ఇంతకీ ఆ ఆఫీసర్ ఎవరనేగా మీ డౌట్ లెట్స్ వాచ్ దిస్ స్టోరీ..

                    వివాదాలతో తరచూ వార్తలకెక్కుతున్న దుర్గగుడిలో దసరా ఉత్సవాల తర్వాత మరో స్కామ్ బయపడింది. ఈసారి ఏకంగా ఏఈవోపైనే ఆరోపణలు రావడంతో ఆయన్ని ఈవో కోటేశ్వరమ్మ సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఆరా తీస్తే  అచ్యుత రామయ్య కి సంబందించి ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. సాధారణంగా ఏఈఓ స్థాయి అధికారి అంటే... మాట తీరు.. హుందాతనంతో ఎదుటివారిని కట్టిపడేసేలా ఉంటారు... అయితే అచ్చుతరామయ్య విషయానికొస్తే ఈ రెండింటిలోను వెనుకబడ్డారనే చెప్పాలి.  మీడియా పీఆర్ఓ గా ఉన్నప్పటికీ అచ్యుత రామయ్యకి విధులపై ఏమాత్రం అవగాహన లేదు. మీడియా ప్రతినిధులకు ఏదైనా సమాచారం ఇవ్వాలంటే క్రింది స్థాయి ఉద్యోగుల సహకారం తీసుకోవాల్సిందే.. అసలు తన ఛాంబర్ లో కాసేపు కూడా కూర్చోడని కింది స్థాయి ఉద్యోగులే చెప్తుంటారు.... ఏదైనా చెప్తే ఒరేయ్ అదేంటో చూడండి అంటూ ఆజ్ఞలు జారీ చేసేవాడట.

                         ఎన్నో సంవత్సరాలుగా దుర్గ గుడిలో  సీనియర్ ఉద్యోగి అచ్యుత రామయ్య  పాతుకుపోయారు. ఇక ఆయన మాట తీరు విషయానికొస్తే నోటి దురుసు ఎక్కువగా ఉన్న ఉద్యోగిగా మంచి పేరు తెచ్చుకున్నాడు... ఎదుటివారు ఎవరైనా ఎంతటివారైనా సరే... ఒరేయ్, ఏరా... అని పిలవడం అచ్యుత రామయ్య నైజం. కొంతమంది ప్రెస్ వాళ్ళని కూడా ఒరేయ్ అని పిలుస్తాడంటే ఆయన నోటి దురుసు అర్థమవుతుంది. గతంలో సింహాచలం టెంపుల్ లో పని చేస్తున్నప్పుడు కూడా ఇదే రీతిలో వ్యవహరించేవాడనే విమర్శలు వినిస్తున్నాయి.

                      దసరా ఉత్సవాల సందర్భంగా ప్రదాన చేసిన మెమొంటోల అవినీతి విషయంలో కూడా అచ్యుత రామయ్య తనదైన శైలిలో ఈఓ పై ఎదురు దాడికి దిగాడు. గతంలో సాంస్కృతిక కార్యక్రమాలకి 30 లక్షలు పైచిలుకు కేటాయిస్తే ఇప్పుడు ఎనిమిది లక్షలకే ఈఓ అన్ని జరిపించడంతో... కొంతమందికి సీనియర్ ఉద్యోగులకి మింగుడు పడలేదు. ఈఓ... తాను తినక, తమను తిననివ్వక పారదర్శకంగా వ్యవహరించడంతో అవినీతి ఉద్యోగులు సహించలేదు. ఎలా అయినా ఈఓని పంపించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఒక మహిళా ఈఓ... అందులోనూ నీతి నిజాయితీతో పని చేస్తున్న ఈఓ. ఒక కాంట్రాక్టు ఉద్యోగిని కర్రతో బెదిరించి, కాలితో తన్ని కావాలనే తనపై నింద మోపిందని అచ్యుత రామయ్య పుకార్ల పుట్టించాడు... ఇది నమ్మశక్యంగా లేదని పలువురు ఉద్యోగులు వ్యతిరేకించారు.. ఈ విషయం ఈఓ చెవినపడటంతో ఆమె అచ్యుత రామయ్యను ప్రశ్నించింది. దీంతో ఆమె ఛాంబర్ లోనే... నేను రిటైర్ అవుతాను నీకు సర్వీస్ ఎక్కువ ఉంది. నువ్వు ఎలా ఉద్యోగం చేస్తావంటూ బెదిరింపులకు దిగాడు. జరిగిన ఘటనపై ఈఓ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో ఆతనిపై విచారణ కొనసాగుతుంది.

                      తాను తప్పు చేసినట్లు ప్రథమిక ఆధారాలున్న అచ్యుతరామయ్య బుకాయింపులకు దిగాడు. ఉన్నతాధికారిని సైతం బెదిరించడంతో అచ్యుతరామయ్య ఎవరి అండతో రెచ్చిపోయాడన్న డౌట్లు వ్యక్తమవుతున్నాయి. ఏళ్ల తరబడి ఒకే కుర్చీలో కొనసాగడానికి..ఇంత బరితెగించడానికి వెనుక ఎవరున్నారనేది విచారణలోనే తేలాలి.

achyuta ram
achyuta ram News
achyuta ram Breakings
achyuta ram Breaking News
achyuta ram Updates
achyuta ram Update News
achyuta ram News Updates
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Achaita Ramayya in controversy

YOU MAY LIKE