ఎయిర్ పోర్ట్ అధికారులపై జగన్ కేసు ఎఫెక్ట్

Submitted by ganesh on Sun, 11/04/2018 - 17:11
ఎయిర్ పోర్ట్ అధికారులపై జగన్ కేసు ఎఫెక్ట్

                   ప్రతిపక్ష నేత జగన్ పై హత్యాయత్న కేసులో ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా క్రమణశిక్షణా చర్యలకు ఆదేశించింది. ఎయిర్ పోర్టు లోపల జగన్ పై దాడికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వేణుగోపాల్ ను బాధ్యుడిని చేస్తూ చెన్నైకి బదిలీ చేశారు. సీఐఎస్ఎఫ్ నిర్లక్ష్యాన్ని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఇండియా తీవ్రంగా పరిగణిస్తోంది.. సొంత ఇంటిలో జరిగిన తప్పిదంపై పోస్ట్ మార్టమ్ నిర్వహిస్తోంది.

                     విశాఖ ఎయిర్ పోర్ట్ లో జగన్ పై రెస్టారెంట్ లో పని చేసే వంట మనిషి హత్యాయత్నానికి పాల్పడటం.. కోడి పందాలకు వాడే కత్తిని వినియోగించి జగన్ పై దాడి చేసిన నేపధ్యంలో కేంద్ర విమానయాన శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది.. హై సెక్యూరిటీ జోన్ లగా పిలవబడే ఎయిర్ పోర్ట్ లో ఓ రాష్ట్ర ప్రతిపక్ష నేతపై దాడిని కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా భావిస్తోంది..

                      ఎయిర్ పోర్ట్ లో ఉన్న ఫ్యూజన్ ఫుడ్స్ లో పని చేస్తున్న శ్రీనివాసరావు రెండు నెలల క్రితమే కత్తులు దాచి ఉంటారని ఏపీ పోలీసుల విచారణలో తేలింది. ఎయిర్ పోర్ట్ లోని వీఐపీ లాంజ్ లోకి నిందితుడిని ఎందుకు పంపించారని..ఒక వేళ పంపినా తనిఖీ చేయకుండా ఎయిర్ పోర్ట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎలా అనుమతిచ్చారనేది కేంద్ర ఉన్నతాధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం ప్రొటోకాల్ ఇన్స్ స్పెక్టర్ అక్కడి ఉండి ఏం చేశారని కూడా కేంద్రం ఆరా తీసినట్లు సమాచారం. ఈ ఎపిసోడ్ లో తొలుత ఎయిర్ పోర్ట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వేణుగోపాల్ పై బదిలీ వేటు పడింది. విచారణలో ఎవరున్నారు అని తేలితే మరి కొంత మందికి స్థాన చలనం కలిగే అవకాశాలున్నాయి..

                          విశాఖ ఎయిర్ పోర్ట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వేణుగోపాల్ తీరుపై కేంద్ర విమానయానశాఖ అసంతృప్తితో ఉంది. ఒక టీడీపీ నేత రికమండేషన్ తో వేణుగోపాల్ విశాఖ ఎయిర్ పోర్ట్ లో పదవి పొందారని ప్రచారంలో ఉంది. జగన్ ఘటనలో వేణుగోపాల్ అశ్రద్ద ఉందా..? లేదా..? అన్న దిశగా దర్యాప్తు చేయాలని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. నిందితుడు శ్రీనివాసరావుకు ఎయిర్ పోర్ట్ లో ఆల్ యాక్సెస్ పాస్ ఎలా వచ్చిందనే దానిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీనివాసరావు ఎయర్ పోర్ట్ లో పని చేస్తున్న సమయంలో సీఐఎస్ఎఫ్ వర్గాలతో స్నేహ పూర్వకంగా నటిస్తూ ఎయిర్ పోర్ట్ లో కలియతిరిగేవాడని.. ఒకనొక సమయంలో రన్ వే మీదకు వెళ్లేవాడన్న సమాచారం ఉంది. ఇది నిజామా..?కాదా...నిజమైతే ఎలా అనుమతిచ్చారన్నది కేంద్ర దర్యాప్తులో తేలాల్సి ఉంది.. దాడి ఎయిర్ పోర్ట్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా జరిగిందా.. లేక పోలీసుల వైఫల్యమా అనేది విచారణలో తేలనుంది.

ys jagan
ys Jagan updates
YS Jagan Court Enquiry
YS Jagan in CBI Court
YS Jagan Press Meet
ys jagan news
YS jagan latest news
YS Jagan Latest updates
YSRCP Latest News
ysrcp news
YS Jagan Announcement
YS Jagan Padayatra
YSRCP Padayatra
YS Jagan Fires
YS Jagan Comments
YSRCP Fires
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Airport Authority Of India Discipline Charges

YOU MAY LIKE