ఇక ప్రపంచ కప్ టార్గెట్..

Submitted by venkateshgullapally on Sun, 11/04/2018 - 16:49
ఇక ప్రపంచ కప్ టార్గెట్..

లేట్ గా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టినా తనదైన ఆట తీరుతో మంచి ప్రదర్శన చేస్తూ నాలుగో స్థానంలో నమ్మదగ్గ బ్యాట్స్‌మన్‌గా పేరు తెచ్చుకున్న అంబటి రాయుడు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కు గుడ్ బాయ్ చెప్పాడు. హైదరాబాద్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతను ఇకపై రంజీ ట్రోఫీతో సహా నాలుగు రోజుల మ్యాచుల్లో అతను ఆడడు. ఈ విషయాన్ని హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం ఓ ప్రకటన ద్వారా తెలిపింది. దేశవాళీ టోర్నీ పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం రాయుడు ఆడతాడు.

ప్రపంచకప్ దగ్గరపడుతున్న నేపధ్యంలో టెస్ట్ క్రికెట్ లోకి వెళ్ళే అవకాశం కూడా లేకపోవడంతో పరిమిత ఓవర్ల క్రికెట్‌పైనే దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో రాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌, ఆ తర్వాత ఏడాది టీ20 ప్రపంచకప్‌ జట్లలో చోటు కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేసాడు. ఇటీవల విండీస్ సీరీస్ లో సైతం తనదైన ఆట తీరుతో విమర్శకుల ప్రసంశలు కూడా అందుకున్నాడు. 17 ఏళ్ల తన సుదీర్ఘ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ కెరీర్‌లో 97 మ్యాచ్‌లాడిన రాయుడు 16 శతకాల సాయంతో 6151 పరుగులు చేశాడు.

world cup
windies
Ambati Rayudu
hyderabad
ambati rayudu good bye 1st class cricket

YOU MAY LIKE