కోహ్లికి ఆ టెన్షన్ తప్పింది

Submitted by venkateshgullapally on Tue, 10/30/2018 - 17:01
కోహ్లికి ఆ టెన్షన్ తప్పింది

ప్రపంచ కప్ కి ముందు టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి ఒక బాధ తీరింది. నాలుగో స్థానంలో బ్యాటింగ్ కి వచ్చే ఆటగాడి విషయంలో గత కొంత కాలంగా తర్జన భర్జన పడుతున్న కోహ్లికి తెలుగు తేజం అంబటి రాయుడు రూపంలో ఒక మంచి ఆటగాడు దొరికాడు. తనకు వచ్చిన అవకాశాలను వినియోగించుకునే రాయుడు విండీస్ తో సీరీస్ లో చెలరేగి ఆడుతున్నాడు. తాజాగా ముగిసిన నాలుగో వన్డేలో అజేయ శతకంతో టీం భారి స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

క్రమంగా వికెట్లు కోల్పోతున్న తరుణంలో బ్యాటింగ్ కి వచ్చిన అతను స్థాయికి తగిన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. దీనిపై విరాట్ కోహ్లి సంతోషం వ్యక్తం చేసాడు. ‘‘అవకాశాన్ని రాయుడు రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. 2019 ప్రపంచకప్‌ వరకు అతడికి మేం మద్దతివ్వాలి. అతడు ఆటను బాగా అర్థం చేసుకుంటాడు. ఎట్టకేలకు ఓ తెలివైన ఆటగాడు నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అని మ్యాచ్ ముగిసిన అనంతరం కోహ్లి వ్యాఖ్యానించాడు.

Ambati Rayudu
team india
Virat Kohli
world cup
AMBATI RAYUDU SUITBLE FOR 4TH PLACE

YOU MAY LIKE