అదే నన్ను నాశనం చేసింది

Submitted by venkateshgullapally on Sat, 11/03/2018 - 16:17
అదే నన్ను నాశనం చేసింది

2008లో సిడ్నీలో భారత్‌, ఆసీస్‌ టెస్టు సందర్భంగా జరిగిన మంకీగేట్‌ ఉదంతంతో తన కెరీరే మసకబారిందని ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ సైమండ్స్‌ కీలక వ్యాఖ్యలు చేసాడు. ఆ సీరీస్ లో హర్భజన్‌ తనను కోతి అన్నాడని సైమండ్స్‌ సంచలన ఆరోపణలు చేసాడు. తాజాగా దీనిపై స్పందించిన అతను ‘‘ఆ క్షణం నుంచి నా పతనం మొదలైంది. విపరీతంగా తాగడం మొదలెట్టా. విపరీతమైన ఒత్తిడికి గురయ్యా. నా సహచరులను అనవసరంగా వివాదంలో ఇరికించానేమోనని బాధపడ్డా’’ అని వ్యాఖ్యానించాడు. హర్భజన్‌ను తనను ‘మంకీ’ అంటూ ఎగతాళి చేశాడన్న ఆరోపణకు ఇప్పటికీ తాను కట్టుబడి ఉన్నానని అతను స్పష్టం చేసాడు. ప్రస్తుతం క్రికెట్ కి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.

andrew symonds
harbhajan sing
Australia tour
ganguly
andrew symonds about monkey gate

YOU MAY LIKE