అనుష్క ఎలా విష్ చేసిందంటే

Submitted by venkateshgullapally on Mon, 11/05/2018 - 16:21
అనుష్క ఎలా విష్ చేసిందంటే

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి నేడు తన 30 వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. విండీస్ తో టి20 సీరీస్ కి తప్పుకున్న కోహ్లి ప్రస్తుతం భార్యతో కలిసి విహార యాత్రకు వెళ్ళాడు. అయితే ఈ సందర్భంగా ఆయన సతీమణి, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ విరాట్‌కు విషెస్‌ తెలుపుతూ అతనితో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆసక్తికర కామెంట్ రాసింది. ‘అతన్ని పుట్టించినందుకు ధన్యవాదాలు దేవుడా’ అని అనుష్క ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. శుక్రవారం సాయంత్రం విరాట్‌, అనుష్క కలిసి విహారయాత్రకు బయలుదేరారు. ఇక మాజి ఆటగాళ్ళు సైతం విరాట్ కోహ్లికి పుట్టిన రోజు వేడుకలను సోషల్ మీడియా వేదికగా చెప్తున్నారు. ప్రస్తుతం అనుష్క చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

Virat Kohli
ANUSHKA SHARMA
team india
anushka wishing virat kohli

YOU MAY LIKE