ఏపీ అప్పుల్లో ఉన్నాం...

Submitted by ganesh on Wed, 11/07/2018 - 13:15
ఏపీ అప్పుల్లో ఉన్నాం...

                     ప్రత్యేక సాయం కింద నవ్యాంధ్రప్రదేశ్ కు లక్ష కోట్లకు పైగా మోదీ సర్కారు ఇచ్చిందన్న బీజేపీ నేతల వ్యాఖ్యలు బూటకాలని కేంద్రమే తేల్చేసింది. నాలుగున్నరేళ్లుగా రాష్ట్రానికి ఇచ్చింది కేవలం 14 వేల 310 కోట్లేనని వెల్లడించింది. ఇక ఇంత మించి మీకు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ కుండ బద్దలు కొట్టినట్లు తెగేసి చెప్పింది.

                      విభజన తర్వాత ఏపీ అప్పుల్లో ఉన్నాం. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం... పోయే ఆదాయమే గానీ వచ్చేదేం లేదు.. రాజధానిని నిర్మించుకోవాలి, మౌలిక వసతులు కల్పించాలి. పొరుగు రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందేవరకు చేయూతనివ్వాలని కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ పదే పదే మొరపెట్టుకున్న కేంద్రం కనికరం చూపకపోగా అవమానకర రీతిలో వ్యవహరిస్తోంది. విభజన హామీలను అమలు చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పదే పదే లేఖలు రాసింది. అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసింది.

                          ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసిన పంపిన దానికి పాత లెక్కలతో ఓ స్టేటస్ నోట్ ను కేంద్రం తయారు చేసి పంపింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రయోజనాలపై కోరిన నివేదికకు కేంద్ర హోం శాఖ విచిత్ర సమాధానం చెప్పింది. కేవలం ఎన్నినిధులు అందాయనే విషయంపై మాత్రమే సమాధానం ఇచ్చింది. కేంద్ర పంపిన జవాబుకు.. ఏపీ అసెంబ్లీ తీర్మానానికి సంబంధం లేదు. సాధారణంగా రాష్ట్రాల నుంచి అందిన విజ్ఞప్తులపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తుంది. అవకాశం ఉన్నంతవరకూ సాయం చేస్తుంది. కానీ మోదీ సర్కారు మాత్రం ఇచ్చినవే నిధులు.. మిగిలిన వాటితో సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది..

                         విభజన చట్టం, హామీలకు సంబంధించి నాలుగున్నరేళ్లుగా ప్రత్యేక సాయం కింద రాష్ట్రానికి ఇచ్చింది కేవలం 14 వేల 310 కోట్లు మాత్రమేనని స్పష్టంగా పేర్కొంది. ఇప్పటి వరకు రాష్ట్రానికి లక్ష కోట్లకు పైగా సాయం చేశామంటున్న బీజేపీ నేతల వ్యాఖ్యలు అవాస్తవాలని దీని ద్వారా నిరూపితమైంది. విభజన తర్వాత 16 వేల కోట్ల లోటు బడ్జెట్ కు నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి 3 వేల 979 కోట్లు మాత్రమే అందాయి. తాజాగా విడుదల చేసిన స్టేటస్ నోట్ లో రెవెన్యూ లోటు భర్తీ గురించి ఎక్కడా  ప్రస్తావన లేదు.

                         16 వేల కోట్లు లోటు బడ్జెట్ గురించి అసెంబ్లీ తీర్మానంలో ప్రత్యేకంగా ప్రస్తావించిన కేంద్రం మాత్రం కరివేపాకులా పక్కన పెట్టేసింది. వెనుకబడిన జిల్లాలకు ఈ ఏడాది ఫిబ్రవరిలో 350 కోట్లు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకుంది. దీని గురించి స్టేటస్ నోట్ లో కనీస సమాచారం లేదు. రాజధానికి 15 వందల కోట్లు.. వెనుకబడిన జిల్లాలకు వెయ్యి 50 కోట్లు, విజయవాడ, గుంటూరు జిల్లాల్లో డ్రైనేజీలు ఏర్పాటుకు వెయ్యి కోట్లు.. పోలవరం ప్రాజెక్టుకు 6 వేల 764.7 కోట్లు ఇచ్చామని స్టేటస్ నోట్ లో పాత లెక్కలను కేంద్రం వెల్లడించింది. విదేశీ రుణ సాయం కింద రాష్ట్రం తీసుకున్న రుణాలకు సంబంధించి కేంద్రమే అసలు, వడ్డీ చెల్లించాల్సి ఉంది. ఈ నాలుగున్నరేళ్లలో 15.81 కోట్ల వడ్డీని కేంద్రం చెల్లిస్తున్నట్లు తెలిపింది.

                              హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన స్టేటస్ కో నివేదిక నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన సాయం వివరాలు సుస్పష్టమయ్యాయి. రాష్ట్ర బీజేపీ నాయకులు చెబుతున్న మాటలకు కేంద్రం ఇచ్చిన వివరాలకు ఏ మాత్రం పొంతన లేకుండా పోయింది. కేంద్రం విడుదల చేసిన నివేదికపై బీజేపీ నేతలు ఏమంటారో చూడాలి

Modi
chandrababu
Chandrababu Naidu
Nara chandrababu naidu
Narendra Modi
Narendra Modi News
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Ap in Deficits

YOU MAY LIKE