ఎత్తైన కొండలు...పిల్లగాలులు...ప్రకృతి అందాలు...

Submitted by ganesh on Thu, 09/20/2018 - 10:50
ఎత్తైన కొండలు...పిల్లగాలులు...ప్రకృతి అందాలు...

               పచ్చటి చీరకట్టుకున్న ఎత్తైన కొండలు... చల్లగ వీచే పిల్లగాలులు..... అబ్బురపరిచే ప్రకృతి అందాలు... హాయిగొల్పే అటవీ సోయగాలు... ఉత్సాహపరిచే బోటు ప్రయాణం...అచ్చెరువొందించే సాహసక్రీడలు.... మాటలకందని ఆనందం...మనస్సు ఉప్పొంగే వాతావరణం... కనీసం ఒక్కసారైనా చూసి తీరాల్సిన చూడచక్కని పర్యాటక ప్రదేశం... అదే కంబాల కొండ. ఇంతకీ ఎక్కడుంది ఆ టూరిస్టిక్ స్పాట్...? హరిత పవనాలు వీచే ఆ రణమీయ ప్రాంతాన్ని మనమూ చూసొద్దాం పదండి...

               అరకులోయ, బొర్రా గుహలు, కైలాసగిరి, రామకృష్ణా బీచ్, రుషికొండ బీచ్, భీమిలి.... వీటి సరసన విశాఖ అందాల్లో భాగంగా నిలచిన ప్రాంతమే కంబాల కొండ. విశాఖ సాగర తీరానికి అభిముఖంగా ప్రకృతి రమణీయతకు అద్దంపట్టే అందాల కొండ... కంబాలకొండ. ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలకు ఎదురుగా, కంబాలకొండకు ఆనుకొని ఉన్న ఈ సంరక్షణ కేంద్రం...పెద్దగా ప్రచార్యం పొందలేదు. జిల్లా అధికారులు దీనిపై దృష్టి పెట్టడంతో... ఇప్పుడిప్పుడు ఈ పర్యాటక అందాలకు ప్రజలు చేరువవుతున్నారు.

                కంబాల కొండ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే... నెమళ్లు, కుందేళ్లు, పాలపిట్టలు, రామ చిలుకలు.. ఇలా ఎన్నో రకాలైన పక్షులు, జంతువులను చూడవచ్చు. ఎన్ని జంతువులు ఉన్నప్పటికీ ఇక్కడి నెమళ్ళ కోలాహలం మురిపిస్తుంది. పురివిప్పి ఆడే మయూరాల వయ్యారాలను చూసేందుకు సందర్శకులు క్యూ కడతుంటారు. ఇక చలాకీ కుందేళ్ల వెంట పరుగులు తీసేవాళ్లు కొంతమందైతే...లేళ్లతో పోటీపడేవాళ్లు మరికొందరు. ఇలా ఎవరికి తోచినవిధంగా వాళ్లు పసిపిల్లలైపోతుంటారు. పచ్చటి ప్రకృతి, జంతువులు, ప్రశాంత వాతావరణంతో పాటు... దగ్గర్లోని కంబాల జలాశయం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. వర్షాకాలంలో కళకళలాడుతూ ఉండే ఈ జలాశయంలో హాయిగా బోటింగ్ కూడా చేయవచ్చు. అన్నట్టు... ఇక్కడ సరదాగా చేపలు పట్టాలనుకునేవారి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా ఉన్నాయండి.

                ఇక మరో ప్రత్యేక ఆకర్షణ గురించి చెప్పాలంటే.."రోప్ వే". కొండమీద నుంచి కంబాల జలాశయానికి చేరుకోవాలంటే... కంబాల కొండకు ఎదురుగా ఉండే మరో కొండకు మధ్యన "రోప్ వే"ను ఏర్పాటు చేశారు. 300 మీటర్ల పొడవుండే ఈ తాడును పట్టుకుని జలాశయంపై నుంచి కొండమీదికి, కొండ మీద నుంచి జలాశయం చేరడం ఓ చక్కటి అనుభూతి.

                2014 లో వచ్చిన హుద్‌హుద్‌ తుపాను బీభత్సానికి కంబాలకొండ కూడా బాగా దెబ్బతింది. అయితే కంబాలకొండకు పూర్వవైభవం తీసుకొచ్చే చర్యలు కూడా చేపట్టారు. ఇక్కడి వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాన్ని ఎకో టూరిజం పార్క్‌ గా మార్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 12 కోట్లతో ప్రపంచ బ్యాంకు నిధులు కూడా కేటాయించింది. అయినా పూర్తి స్థాయిలో పనులు మొదలుకాకపోడవం ప్రకృతి ప్రేమికులని నిరాశపరుస్తోంది.  ఇందులో సీతాకోక చిలుకల పార్క్‌, ఔషధ మొక్కల పెంపకం, నడక దారి, నీటి కందకాలు, చెక్‌ డ్యాములు, బయో పార్క్‌, ఎకో ఫ్రెండ్లీ కాటేజి, పగోడాలు, విశ్రాంతి గదులు, పిల్లల పార్క్‌, జెట్టీ, ఫైబర్‌ బోట్లు, ఫైర్‌ వాచ్‌ టవర్లు, ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ తదితర సౌకర్యాలను కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

                 ఈ పార్కులో మరో ప్రత్యేకత... కొండపై ఉన్న వాచ్ టవర్‌. ఈ టవర్‌పైకి చేరుకుని చుట్టూ విస్తరించిన అడవి అందాలను తిలకిస్తూ ప్రకృతి ఒడిలో మైమరచి పోవచ్చు. అలాగే ఈ పార్క్‌ లో ఉన్న జంబాల జలాశయంలో నీళ్లు ఉన్న సమయంలో బోటింగ్‌కు కూడా అనుమతిస్తారు. ఈ జలాశయంలో బోటింగ్ చేయడం ఓ చక్కని అనుభూతి. ఇది అందాల కొండ.. కంబాల. ప్రకృతి ఒడిలో అందాలను ఆస్వాదిసూ... సైట్ సీయింగ్, బోటింగ్, ట్రెక్కింగ్, జంతువులు, పక్షులతో ఆటలు, పాటలు, సాహసాలు..ఇవన్నీ చేయాలనుకుంటున్నారా ? అయితే మరెందుకాలస్యం... విశాఖలోని "కంబాల కొండ ఎకో టూరిజం పార్కు"కు పరుగులెత్తండి మరి.

Beautiful Nature
Visakapatnam
Beautiful Nature News
Beautiful Nature Breakings
Beautiful Nature Breaking News
Beautiful Nature Breaking Updates
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Beautiful Nature In Visakapatnam

YOU MAY LIKE