ఊహించని దెబ్బ కొట్టిన బళ్ళారి...

Submitted by venkateshgullapally on Tue, 11/06/2018 - 14:26
ఊహించని దెబ్బ కొట్టిన బళ్ళారి...

కర్ణాటకలో జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపికి గట్టి షాక్ తగిలింది. కంచుకోట లాంటి బళ్ళారి నియోజకవర్గం నుంచి ఓటమి చవి చూసింది ఆ పార్టీ. మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఎంపీ గా ఉన్న శ్రీరాములు పోటి చేసారు. అందుకు గాను బళ్లారి పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేయడంతో నవంబర్ 3న ఉప ఎన్నిక జరిగింది. ఈ స్థానం నుంచి ఆయన సోదరి వి.శాంత బీజేపీ తరపున బరిలోకి దిగగా కాంగ్రెస్ నుంచి వీఎస్ ఉగ్రప్ప బళ్లారిలో పోటి చేసారు. ఆమెపై ఉగ్రప్ప దాదాపు 3 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించి గట్టి షాక్ ఇచ్చారు. వాస్తవానికి ఈ స్థానం బిజెపి కంచుకోట 2004 నుంచి భాజపానే విజయం సాధిస్తుంది. 2004 ముందు ఇక్కడ కాంగ్రెస్ హవా ఉండేది. ఆ తర్వాత గాలి జనార్ధన్ రెడ్డి సోదరులు సత్తా చాటడంతో కాంగ్రెస్ విజయం సాధించలేకపోయింది. ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో కూడా ఇలాంటి కంచుకోటలను బిజెపి కోల్పోయిన సంగతి తెలిసిందే.

bellary
BJP
shock
win
Congress
bellary shock to bjp

YOU MAY LIKE