బయోపిక్‌ల హవా...

Submitted by ganesh on Thu, 11/01/2018 - 17:29
బయోపిక్‌ల హవా...

                    ప్రజంట్ అన్ని ఇండస్ట్రీలలో బయోపిక్‌ల సీజన్‌ నడుస్తోంది. సినీ రాజకీయా క్రీడా ప్రముఖుల జీవిత కథల నేపథ్యంలో పలు భాషల్లో సినిమాలు రూపొందుతున్నాయి. తాజాగా ఈ లిస్ట్‌లో ఓ సైంటిస్ట్‌ కూడా చేరబోతున్నాడు.అతడే ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ .మాధవన్‌ లీడ్ రోల్‌ లో నటిస్తున్న ఈ సినిమా టీజర్ రిసెంట్ గా రిలీజైయింది.ఆడియాన్స్ లో అటేక్షన్ పెంచింది.

                      కోలీవుడ్ హీరో మాధవన్.. మహదేవన్ కాంభోలో తెరకెక్కుతున్న మూవి  'రాకెట్రీ-ది నంబి ఎఫెక్ట్'.  ఇస్రోలో సీనియర్ సైంటిస్ట్ గా పనిచేసిన నంబి నారాయణన్ జీవితం లో జరిగిన కొన్ని కీలకమైన పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రన్ని నిర్మిస్తున్నాడు డైరెక్టర్. నంబి నారాయణన్ పై గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడ్డట్లు 1994లో ఆరోపణలు వచ్చాయి.  ఆ ఆరోపణలను సీబీఐ 1996లో కొట్టిపారేయగా  1998లో సుప్రీం కోర్టు కూడా ఆయనకు నిర్దోషి అని ఏ తప్పూ చేయలేదని క్లీన్ చిట్ ఇచ్చింది.

                      "కొన్ని సార్లు ఒక మనిషికి అన్యాయం జరిగితే దేశానికి అన్యాయం జరిగినట్టే" అని ఒక క్యాప్షన్ చూపిస్తూ.. "నంబి నారాయణన్ నిజ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం" అని తెలిపారు. ఒక సైంటిస్ట్  జీవితం లో జరిగిన కీలక పరిణామాలు ఆయనకు పర్సనల్ గా జరిగిన నష్టం కంటే కొన్ని వేల లక్షల రెట్లు మనదేశానకి జరగడం అంటే ఇది మనందరం అలోచించాల్సిన విషయమే.అందుకే టీజర్  చివరలో "నా పేరు నంబి నారాయణన్.. నేను 35 సంవత్సరాలు రాకెట్రీలో గడిపాను.. 50 రోజులు జైల్లో గడిపాను. ఆ యాభై రోజుల మూల్యం ఏదైతే నా దేశం చెల్లించిందో దాని గురించి ఈ కథ... నా గురించి కాదు" అని మాధవన్ అంటాడు.

                       మొత్తనికి నంబి నారాయణన్ పాత్రలో మాధవన్ కనిపించడంతో పాటు.... త‌మిళ ద‌ర్శకుడు అనంత మ‌హ‌దేవ‌న్‌తో కలిసి స్వయంగా దర్శకత్వం బాధ్యతలను కూడా చేపడుతున్నాడు. నంబి నారాయ‌ణ్ జీవితంలోని మూడు ప్రధాన కోణాల‌ను ఈ బ‌యోపిక్‌లో చూపించబోతున్నాడు డైరెక్టర్.ఇక ఈ సినిమాని2019 సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళ, ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి అన్ని ఏర్పట్లు చేస్తోంది ఆ సినిమా యూనిట్. మరి ఈ సినిమాతో మాదవన్ కెరిర్ ఏ రెంజ్ కి చెరుతుందో వెచి చూడాల్సిందే.

MADHAVAN
Madhavan News
Madhavan breakings
Madhavan Breaking News
Madhavan Breaking Updates
Madhavan Update News
Madhavan News Updates
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Bio Pic Is Trending On

YOU MAY LIKE