ఎన్నికల్లో బీజేపీ అజెండా రామమందిర నిర్మాణమేనా?

Submitted by ganesh on Mon, 11/05/2018 - 16:21
ఎన్నికల్లో బీజేపీ అజెండా రామమందిర నిర్మాణమేనా?

                   2019ఎన్నికల్లో బీజేపీ అజెండా మళ్లీ రామమందిర నిర్మాణమే కాబోతుందా? 2014ఎన్నికల్లో మోదీ మానియాతో గట్టెక్కిన బీజేపీకి ఈసారి రాముడే దిక్కయ్యాడా అంటే  తాజా రాజకీయ పరిణామాలు అవుననే అంటున్నాయి. 2019 ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గుతాయనే సర్వేలు..ప్రతిపక్షాలన్నీ జట్టు కట్టడంతో బీజేపీ మరోసారి హిందువుల ఓట్ల ఏకీకరణ కోసం పాకులాడుతోంది. ఇది బీజేపీ నేతల ఉలిక్కిపాటు వ్యాఖ్యలతో  తేటెతెల్లం అవుతోంది.

                   ప్రధానంగా ఇటీవల అయోధ్య కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసినప్పటి నుంచీ..రామజన్మభూమి అంశం మళ్లీ హాట్‌ టాపిక్‌గా మారింది. హిందూ సంఘాలు, సాధువులు, బీజేపీ నేతలు నిత్యం ఏదో ఒక కామెంట్‌ చేస్తుండడంతో..రాజకీయంగానూ దుమారం రేగుతోంది. తాజాగా కేంద్రమంత్రి ఉమాభారతి కాంగ్రెస్ టార్గెట్‌గా తీవ్ర విమర్శలు గుప్పించారు. తనతో పాటు రామ మందిర శంకుస్థాపన కార్యక్రమంలో రాహుల్ పాల్గొనాలని..అప్పుడే కాంగ్రెస్ చేసిన పాపాలు కొంత వరకైనా తొలగుతాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

                     స్ర్కోలింగ్ పీడి  (ఈ ప్రపంచంలో అత్యంత సహనం కలిగిన వాళ్లు హిందువులు మాత్రమే. నేను రాజకీయ నేతలకు విజ్ఞప్తి చేస్తున్నా. అయోధ్య జన్మభూమి ప్రాంతంలో మసీదు నిర్మించాలని వ్యాఖ్యలు చేస్తూ..హిందువుల్లో అహసనం పెంచకండి. ఇది స్థల వివాదం మాత్రమే. విశ్వాసాలకు సంబంధించిన వివాదం కాదు. అయోధ్య రాముడి జన్మస్థలం. మదీనాలో దేవాలయం కనిపించదు. వాటికన్ సిటీలో మసీదు ఉండదు. అలాంటప్పుడు అయోధ్యలో మసీదు గురించి మాట్లాడటం సమంజసం కాదు. నాతో పాటు రామమందిర శంకుస్థాపన కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొనాలి. అప్పుడు కాంగ్రెస్ చేసిన పాపాల్లో కొంతవరకైనా తొలగిపోతాయి. అన్ని పార్టీల వాళ్లూ దీనికి సహకరించాలి. సమస్య పరిష్కారం కాకుండా చేస్తున్నారు. దేశాన్ని విభజించే కుట్రలను మానుకొని అందరూ ఏకమవ్వండి. నా సమాధిపై రాముడి నిర్మాణం జరుగుతుందని వాళ్లు భావిస్తే..దానికి నేను సిద్ధం.

                 డిసెంబర్ 6నే శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందన్న సాధ్వి విశ్వహిందూ పరిషత్ నేత సాధ్వి ప్రాచి రామమందిరం విషయంలో సంచలన  వ్యాఖ్యలు చేశారు. అయోధ్యంలో రామమందిర నిర్మాణం వైభవంగా జరగబోతోందని..డిసెంబరు 6నే  శంకుస్థాపన కార్యక్రమం జరగనుందని వెల్లడించారు. ఢిల్లీలో అఖిల భారత సంత్ సమితి కార్యక్రమానికి హాజరైన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

                 అయోధ్యంలో రామమందిర నిర్మాణం వైభవంగా జరుగుతుంది. డిసెంబరు 6న శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. దేశంలోని హిందువులందరినీ అయోధ్యకు ఆహ్వానించి, రామమందిర నిర్మాణంపై ప్రకటన చేయాలి. ఇంకెవరూ అవసరం లేదు.

                 రామ మందిర నిర్మాణంపై కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావాలంటూ పలు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో అయోధ్య విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయోధ్యలో సరయు నది తీరాన భారీ రాముడి విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. అటు ప్రభుత్వ అధికారులు సైతం ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నారు. 

                    దీపావళి సందర్భంగా అయోధ్యలో జరిగే దీపోత్సవం కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ పాల్గొంటారు. దక్షిణ కొరియా ఫస్ట్ లేడీ కిమ్ జంగ్ సూక్ నవంబరు 6న దీపోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఆ వేదికగా రాముడి విగ్రహం ఏర్పాటుపై అధికారిక ప్రకటన చేస్తారని సమాచారం. ఇందులో భాగంగానే  అయోధ్య ప్రజలు త్వరలో శుభవార్త వింటారనే ప్రచారం సాగుతోంది. . ఆ గుడ్ న్యూస్ రాముడి విగ్రహ ఏర్పాటుకు సంబంధించినదేనని బీజేపీ నేతలు చెబుతున్నారు.

                      సరయు నది తీరంలో సంత్‌ తులసీదాస్‌ ఘాట్‌ సమీపంలో విగ్రహ ఏర్పాటును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 151 మీటర్ల విగ్రహం, 50 మీటర్ల ఫ్లాట్‌ఫారంతో కలిపి మొత్తం నిర్మాణం పొడవు 201 మీటర్ల ఉంటుందని సమాచారం. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.775 కోట్లు ఖర్చవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. విరాళాల ద్వారా నిధులను సేకరించాలని యోచిస్తోంది.

                       మరోవైపు  వివాదాస్పద బాబ్రీ మసీదు-రామజన్మభూమి సమస్య పరిష్కారానికి ఉత్తరప్రదేశ్‌ షియా సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు కొత్త పరిష్కారాన్ని సూచించింది. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించి, లఖ్‌నవ్‌లో మసీదును నిర్మించాలన్న ప్రతిపాదనను సుప్రీం కోర్టులో సమర్పించింది. దేశ ప్రయోజనాలు, హిందూ, ముస్లింల మధ్య సోదర భావాన్ని పెంపొందించేందుకే ఈ ప్రతిపాదన చేసినట్లు సుప్రీంకు షియా వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ సయ్యద్‌ వసీం రిజ్వీ తెలిపారు.

                      అయితే బీజేపీ నేతల రామజపంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. నాలుగున్నరేళ్లుగా ఆర్డినెన్స్ గురించి కానీ.. రామమందిరం సాధ్యాసాధ్యాలపైనా మాట్లాడని బీజేపీ నేతలు.. ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడగానే రాజకీయం చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు

                   మొత్తం మీద 2019లో బీజేపీ ఎన్నికల అజెండా రామమందిర నిర్మాణమే అనేది ఆపార్టీ నేతల వ్యాఖ్యలు ప్రకటనలతో దాదాపు తేలిపోయింది. ఇక బీజేపీ రామాస్ర్తం ఎలా పనిచేస్తుందో చూడాలి..

BJP
bjp news
Bjp Breakings
bjp breaking news
BJP Breaking Updates
Bjp Up Date News
Modi
Modi news
Modi updates
Modi Update News
AP24x7
AP24x7 news
AP24x7 Breakings
ap24x7 breaking news
AP24x7 Breaking Updates
AP24x7 Update News
Is the BJP agenda is Building Ram Mandir

YOU MAY LIKE