మరో కేసులో ఇరుక్కున్న మైనింగ్ డాన్

Submitted by Likhitha on Thu, 11/08/2018 - 09:47
మరో కేసులో ఇరుక్కున్న మైనింగ్ డాన్

                  మైనింగ్ డాన్ గాలి జనార్ధనరెడ్డి మరో కేసులో ఇరుక్కున్నారు. అక్రమ మైనింగ్ కేసులో ఇప్పటికే నిండా మునిగిన గాలి.. తాజాగా ఈడీ కేసులో ఇరుక్కున్నారు. ప్రజలను చీటింగ్ చేసిన ఓ కంపెనీని కేసు నుంచి తప్పించేందుకు గాలి సెటిల్మెంట్ చేయబోయి అడ్డంగా బుక్కయ్యారు. ప్రస్తుతం ఆయన కోసం కర్ణాటక పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

                  కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డిని కేసులు వెంటాడుతున్నాయి. ఓబుళాపురం మైనింగ్ కేసు నుంచే బయటకురాలేక నానా ఇబ్బందులు పడుతున్న గాలి జనార్ధనరెడ్డి.. అప్పట్లో బెయిల్ కోసం జడ్జిలతో బేరమాడి మరింత ఇరుక్కున్నారు. తాజాగా కర్ణాటకలో వేలాది మంది నుంచి డిపాజిట్లు సేకరించి ముంచేసిన అంబిడెంట్‌ కంపెనీని ఈడీ కేసు నుంచి కాపాడటానికి రూ.20 కోట్లతో గాలి జనార్ధనరెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మైనింగ్ కేసును ధైర్యంగా ఎదుర్కొన్న గాలి.. ఈడీ కేసు బయటికొచ్చినప్పటి నుంచి పరారీలో ఉన్నారు. ప్రస్తుతం గాలితో పాటు ఆయన బ్యాచ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.gali

                 అంబిడెంట్ కంపెనీ కేసులో విచారణ సాగిస్తున్న పోలీసులకు గాలి జనార్ధనరెడ్డి, ఆయన పీఏ అలీ ఖాన్ కు ఈ కేసుతో సంబంధమున్నట్లు తేలింసిది. అంబిడెంట్ కంపెనీని ఈడీ కేసు నుంచి బయటపడేసేందుకు గాలి ఒప్పందం కుదుర్చుకున్నురు. ఈడీ అధికారులకు లంచం ఇచ్చి కేస్ క్లోజ్ చేయిస్తానని గాలి వారికి మాటిచ్చినట్లు తెలుస్తోంది. ఈడీ అధికారులకు లంచం ఇచ్చి మేనేజ్ చేసేందుకు 20 కోట్ల 50 లక్షలకు గాలి తరపున పీఏ అలీఖాన్ ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగా అంబిడెంట్ కంపెనీ.. రమేష్ కొఠారి అనే వ్యక్తి ఖాతాకు 18కోట్లు బదిలీ చేశాడు. వాటితో 57 కిలోల బంగారం కొనుగోలు చేసి బళ్లారికి చెందిన రమేష్ కు ఇచ్చినట్లు విచారణలో వెల్లడైంది. ఈ బంగారాన్ని గాలి జనార్ధనరెడ్డి పీఏ అలీఖాన్ కు ఇచ్చినట్లు రమేష్ ఒప్పుకున్నారు.

                  రమేష్ ఇచ్చిన వాంగ్మూలంతో రంగంలోకి దిగిన పోలీసులు గాలి జనార్ధనరెడ్డి కోసం గాలిస్తున్నారు. బెంగళూరు హైదరాబాద్ లోని గాలి నివాసాల్లో తనిఖీలు చేశారు. కానీ గాలి జనార్ధనరెడ్డి పరారీలో ఉన్నాయి. ఆయన నివాసాలకు తాళం వేసి ఉంది. తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లిన అధికారులు సోదాలు నిర్వహించారు. మరోవైపు పరారీలో ఉన్న గాలి, ఆయన అనుచరులు విదేశాలకు పారిపోయే అనుమానం ఉన్నందున గాలిపై లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. మరోవైపు విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, చోక్సీ తరహాలోనే గాలి కూడా విదేశాలకు పారిపోయే అవకాశముంది.

BJP
ex minister
Gali Janardhan Reddy
Escapes
CBI Raids
KARNATAKA
Mining case
Ambident Company
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
BJP Ex Minister Gali Janardhan Reddy Escapes after CBI Raids
Video URL

YOU MAY LIKE