అమెరికా విదేశాంగ విధాన వ్యూహకర్త...

Submitted by ganesh on Sat, 12/01/2018 - 18:47
అమెరికా విదేశాంగ విధాన వ్యూహకర్త...
  • అమెరికా విదేశాంగ విధాన వ్యూహకర్త

  • గల్ఫ్ వార్ తో సద్ధాం హుస్సేన్ ను గడగడలాడించిన యోధుడు

  • అమెరికా 41వ అధ్యక్షుడు జార్జ్ హార్బర్ట్ వాకర్ బుష్ మృతి

  • 1989-93 వరకూ అమెరికాకు 41వ అధ్యక్షుడిగా సేవలందించిన బుష్

 

         అమెరికా మాజీ అధ్యక్షుడు సీనియర్ బుష్ అనారోగ్యంతో చనిపోయారు. అమెరికా 41వ అధ్యక్షుడిగా పనిచేసిన జార్జ్ HW బుష్...94 యేళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. అమెరికా విదేశాంగ విధాన రూపకర్తగా కీర్తించబడే  జార్జ్ బుష్ అగ్రరాజ్యం అభివృద్ధిలో చెరగని ముద్ర వేశారు. ఆయన హయాంలో చేపట్టిన ఎన్నో సంస్కరణలు అగ్రరాజ్యంలో కొనసాగుతున్నాయి.తండ్రి రాజకీయస్ఫూర్తితో  ఆయన తనయుడు జార్జ్ డబ్ల్యూ బుష్ కూడా అమెరికా అధ్యక్షుడిగా పనిచేయడం విశేషం.

           అమెరికా విదేశాంగ విధాన వ్యూహకర్తగా.. సోవియెట్ యూనియన్ కుప్పకూల్చి ,గల్ఫ్ వార్ తో సద్ధాం హుస్సేన్ ను గడగడలాడించిన యోధుడు సీనియర్ బుష్ అనారోగ్యంతోచనిపోయారు.  1989 నుంచి 1993 వరకు అమెరికాకు 41 అధ్యక్షుడిగా  జార్జ్ హర్బర్ట్ వాకర్ బుష్  సేవలందించారు. రెండో ప్రపంచ యుద్ధం జరిగిన సమయంను ప్రత్యక్ష్యంగా వీక్షించిన జార్జ్ బుష్ యుద్ధ వ్యవహారాల్లో ఆరితేరారు.

             జార్జ్ బుష్ అమెరికా అభివృద్ధిలో చెరగని ముద్ర వేశారు. ఇప్పటికీ మూడు దశాబ్దాల క్రితం బుష్ ప్రవేశ పెట్టిన సంస్కరణలనే అమెరికా పాటిస్తోందంటే ఆయన పాలన ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఒక అగ్రరాజ్యానికి అధ్యక్షుడ అయినప్పటికీ ఆ గర్వం కించిత్‌ అయినా జార్జ్ బుష్ ముఖంలో కనిపించేది కాదని పలువురు ప్రముఖులు ఇప్పటికీ కొనియాడుతారు. తను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మంచి పాలనా పరమైన విధానాలు ప్రవేశపెట్టి జనాధరణ పొందినప్పటికీ... కుదేలైన ఆర్థిక వ్యవస్థతో  1992 తిరిగి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కాలేకపోయారు.

             హ్యారీ ట్రూమాన్, రూజ్వెల్ట్స్ తర్వాత బుష్ అత్యంత విజయవంతమైన విదేశాంగ విధానం కలిగిన అధ్యక్షుల్లో ఒకరిగా పేరుతెచ్చుకున్నారు సీనియర్ బుష్. ఇక 1989లో సోవియట్ యూనియన్ కుప్పకూల్చడంతో జార్జ్ బుష్ సత్తా ప్రపంచానికి తెలిసింది. ..సద్దాం హుసేన్ కువైట్ ను  అక్రమించుకుని ఇక సౌదీ మీదకు దండయాత్ర చేస్తాడనంగా జార్జ్ బుష్  32 దేశాలను వప్పించి, సంకీర్ణసైన్యం రూపొందింది సద్దాంకు వ్యతిరేకంగా గల్ఫ్ యుద్ధం నడిపారు. సద్దాం ను ఓడించారు..అయితే సద్దాంను గద్దెదించడంలో విఫలం అయ్యారు.ఆయన కొరికను 12 సంవత్సరాల  అనంతరం ఆయన కొడుకు జూనియర్ బుష్ సద్ధాంను అంతమొందించడం ద్వారా నెరవేర్చారు.

              విదేశాంగ విధాన వ్యూహకర్త పేరుతెచ్చుకున్న బుష్ .. దేశీయంగా మాత్రం విఫలమయ్యారు. రాజకీయంగా ఆయన  బాగా అప్రతిష్టపాలయ్యారు. గల్ఫ్ యుద్దం తర్వాత  1992లో రెండో దఫా అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపాయారు.

              రెండో ప్రపంచ యుద్ధ  సైనికుడిగా పనిచేసిన సీనియర్ బుష్ అమెరికా రాజకీయాలను ఎంతగానో ప్రభావితం చేశారు. చైనాలో అమెరికా రాయబారిగా ఉన్నారు. అపైన అమెరికా రాజకీయాల్లోకి వచ్చి తనదైన ముద్ర వేసిన సీనియర్ బుష్ .. కు ఐదుగురు పిల్లలు.. సీనియర్ బుష్ కుమారుడు జార్జ్ డబ్ల్యూ బుష్ 2001  నుంచి 2009 వరకూ వరుసగా రెండు సార్లు అమెరికా అధ్యక్షుడిగా కొనసాగడంలోనూ జార్జ్ హర్బర్ట్ వాకర్ బుష్  ప్రభావితం చేశారు. సీనియర్ బుష్ మృతి పట్ల అమెరికా మాజీఅధ్యక్షులు  బరాక్ ఒబామా, క్లింటన్ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

Former US
Former US President
George Bush
George Bush Passes Away
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Brush Is No More

YOU MAY LIKE