తెలంగాణ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు

Submitted by ganesh on Fri, 11/09/2018 - 13:46
తెలంగాణ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు

                    కాంగ్రెస్, టీడీపీ ల మద్య సీట్ల సర్దుబాట్లు చివరి దశకు వచ్చాయి. టీడీపీకి 14 సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. దీంతో అధినేత చంద్రబాబు, తెలంగాణ తమ్ముళ్లతో ఇవాళ భేటీ అయి పోటీ చేయనున్న స్థానాలు, అభ్యర్ధుల పేర్లను ఖరారు చేస్తారు. అనంతరం అభ్యర్ధులను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ ప్రకటిస్తారు.

                    తెలంగాణలో టీడీపీ పోటీ చేసే నియోజకవర్గాలు దాదాపు ఖరారయ్యాయి. 14 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటిచేందుకు ఇరు పార్టీల మద్య అంగీకారం కుదిరింది. తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న ఉత్తర తెలంగాణ నుంచి టీడీపీ పోటీ చేయడం లేదు. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల నుంచే పోటి చేయాలని నిర్ణయించింది. ఈ జిల్లాల్లో టీడీపీ పోటీ చేసే స్థానాలపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, తెలంగాణ టీడీపీ నేతలతో ఇవాళ భేటీ అవుతున్నారు. అమరావతిలో టీటీడీపీ అధ్యక్షులు రమణ, పోలిట్ బ్యూరో సబ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డిలతో ఇప్పటికే చర్చలు జరిపిన బాబు పోటి చేసే స్థానాలపై స్పష్టత నిచ్చారు. దీనిపై మరో సారి చర్చించిన తర్వాత సీట్లు, అభ్యర్ధులను ఖరారు చేయనున్నారు. అయితే పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు పోటి చేసే స్థానాలు, అభ్యర్ధులు ఈ విధంగా ఉన్నాయి.

                      గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఖైరతాబాద్ నుంచి TNTUC అధ్యక్షులు బీ ఎన్ రెడ్డి, శేరిలింగంపల్లి నుంచి భవ్య ఆనంద్ ప్రసాద్, కూకట్ పల్లి నుంచి శ్రీనివాస్ రావు, సికింద్రాబాద్ నుంచి కూన వెంకటేష్ గౌడ్, ఉప్పల్ నుంచి వీరేందర్ గౌడ్, రాజేంద్ర నగర్ నుంచి సామ భూపాల్ రెడ్డి  లేదా గణేష్ గుప్తా, చార్మినార్ నుంచి  పార్టీ ఉపాధ్యక్షుడు మస్కతి పేర్లు దాదాపు ఫైనల్ అయినట్లు సమాచారం. ఇక ఖమ్మం టౌన్ నుంచి మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, అశ్వారావు పేట నుంచి మచ్చా నాగేశ్వరరావు, నల్గొండ జిల్లా కోదాడ నుంచి బొల్లం మల్లయ్య యాదవ్ పొటీ చేయనున్నట్లు సమాచారం. మహబూబ్ నగర్ జిల్లాల్లోని మహబూబ్ నగర్, మక్తల్, దేవరకద్ర నియోజకవర్గాల నుంచి మాజీ ఎమ్మెల్యేలు ఎర్ర శేఖర్, దయాకర్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డిలను బరిలో నిలిపేందుకు బాబు డిసైట్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ పద్నాలుగు సీట్ల తో పాటు మలక్ పేట, మిర్యాల గూడ సీట్లను టీడీపీ ఆశిస్తోంది. వీటిపై ఏలాంటి హమీ రాకపోవడంతో మొదటి విడతలో భాగంగా మొత్తం 14  సీట్లతో అభ్యర్ధుల జాబితాను పార్టీ రాష్ట అధ్యక్షుడు ఎల్ రమణ ప్రకటించనున్నారు.

                      తక్కువ స్థానాలు తీసుకున్నా..గెలిచే స్థానాల్లోనే బరిలో నిలవాలని భావించిన టీడీపీ అందుకు తగ్గట్లుగానే అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. అభ్యర్థుల జాబితా ఫైనల్ అయిన ప్రచారంపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.

chandrababu
chandrababu news
Chandrababu Breakings
chandrababu breaking news
Chandrababu updates
Chandrababu Update News
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
ChandraBabu Works On Telangana Candidates

YOU MAY LIKE