కోడిని కోయకుండానే చికెన్

Submitted by venkateshgullapally on Wed, 10/17/2018 - 14:34
కోడిని కోయకుండానే చికెన్

కొంత మందిని మీరు మాంసాహారం ఎందుకు తినడం లేదు అని అడిగితే మాకు జంతువులను చంపడం ఇష్టం ఉండదు అందుకే తినట్లేదు అని చెప్తారు. కాని ఇప్పుడు వారికి ఆ బాధ అవసరం లేదు. జంతువులను చంపకుండానే మాంసం వచ్చేస్తుంది. కోళ్లు, మేకలను చంపకుండానే వాటి మాంసాన్ని తినే రోజులు వచ్చేస్తున్నాయి. కోడి రెక్కల కణాల నుంచి వారు మాంసం ముక్కలను అభివృద్ధి చేశారు అమెరికా శాస్త్రవేత్తలు.

వారు కణ ఆధారిత మాంస ఉత్పత్తిపై దృష్టిసారించారు. వండిన అనంతరం వాటి రుచి అచ్చం కోడి మాంసాన్నే పోలి ఉండటంతో ఈ ప్రయోగం దాదాపుగా విజయవంతం అయినట్టే కనపడుతుంది. చేపల వంటి ఇతర జంతువుల సజీవ కణాల నుంచి వాటి మాంసాన్ని కూడా ఇదే తరహాలో ప్రయోగశాలల్లో ఉత్పత్తి చేయవచ్చునని వారు చెప్పడం విశేషం. మరి ఇది ఎప్పుడు విపణిలోకి వస్తుందో వారు చెప్పలేదు.

chicken
america
goat
meal
chicken with out harm

YOU MAY LIKE