అద్భుతమైన మహత్తర శక్తి

Submitted by ganesh on Wed, 11/07/2018 - 13:48
అద్భుతమైన మహత్తర శక్తి

                     ఉపన్యాసాలు చాలామంది చెబుతారు. కానీ, కోటికొక్కరు మాత్రమే ఆచరించి చూపిస్తారు. ఆ ఒక్కరే శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి. మానవ సేవే మాధవ సేవగా ప్రచారం చేస్తూ, ఆచరణలో నిరూపిస్తూ ఆధునిక ఆధ్యాత్మికతను కొత్త పుంతలు తొక్కిస్తున్న చిన్నజీయర్‍ స్వామి అందరికీ ఆరాధ్యులయ్యారు.. చిన్న జీయర్ స్వామి 63వ జన్మదిన వేడుకలకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం శ్రీరామ్ నగర్ లోని జీయర్ ఆశ్రమం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. దశాబ్దాలుగా ఆధ్యాత్మిక బోధనలతో తరింప చేస్తున్న చిన్న జీయర్ స్వామీజీ జన్మదినం సందర్భంగా భక్తులు ప్రత్యేక కార్యక్రమలు ఏర్పాటు చేశారు. తిరునక్షత్ర మహోత్సవంలో భాగంగా ఐదు రోజులపాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

                        సామాన్యులకు ప్రతి చిన్నపనీ కష్టమైందిగానే కనిపిస్తుంది. కానీ మహానుభావులకు మహా కార్యమైనా అణువంతే అనిపిస్తుంది. లక్షలాది మందికి ఆచార్యులుగా ఉన్న శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి ఒక వ్యక్తి కాదు..  ప్రచండమైన, అద్భుతమైన మహత్తర శక్తి. వయసు ఆరు పదులు దాటినా 700 శ్లోకాల భగవద్గీతను లక్షల మందిచే పలికించే భక్తి శక్తి చిన్న జీయర్ స్వామికి శ్రీమన్నారాయణుడు ఇచ్చిన అనుగ్రహం. దేవుడి అనుగ్రహాన్ని భక్తులదంరికీ కలిగించేందుకు చిన్న జీయర్ స్వామి ఎంతో కృషి చేస్తున్నారు.. అందుకే ఆయన జన్మదిన వేడుకలను ఏటా ఒక మహోత్సవంలా జరుపుకుంటారు భక్తులు.

                       1956 నవంబర్ 3న వెంకటాచార్యులు, అలవేలు మంగ తాయారు దంపతులకు రాజమండ్రి సమీపంలోని అర్తమూర్ గ్రామంలో జన్మించిన చినజీయర్ తన 23 ఏట సన్యాసాశ్రమం స్వీకరించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి పెద్ద శ్రీమన్నారాయణ రామానుజు జీయర్‌.. చిన్న జీయర్ గురువులు. 1981లో గుంటూరు జిల్లా నడిగడ్డపాలెంలోని శ్రీమత్ ఉభయ వేదాంత ఆచార్య పీఠం అధిపతిగా చిన జీయర్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం శ్రీరామనగరాన్ని ప్రధాన కేంద్రంగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. నాటి నుంచి స్వామిజీ చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా నడుస్తూ ఉన్నాయి. సన్యాస స్వీకరణ తర్వాత కొన్నేళ్లకు చిన్న జీయర్ గీతాజ్యోతి ఉద్యమాన్ని చేపట్టారు. ఆ ఉద్యమం కేవలం భగవద్గీత ప్రాచుర్య రూపకాన్నే కాక, సమాజంలో ఉన్న సోమరితనాన్ని తొలగించే, సౌభ్రాతృత్వ భావనను ప్రతి ఒక్కరిలో మేల్కొల్ప గలిగే వ్యూహంగా కూడా రూపుదిద్దుకుంది. విద్య అనేది ఒక వర్గానికో, వర్ణానికో కాకుండా మానవాళికంతటికీ అందాలనే ఉద్దేశంతో ఆ వేద పాఠశాలలనే గురుకుల పాఠశాలలుగా మార్చి, అన్ని రకాల విద్యలనీ బోధించే సౌకర్యాన్ని కల్పించారు. ఇటువంటి ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్న జీయర్ స్వామి జన్మదిన వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేశారు వేద పండితులు.

                          చిన్నజీయర్ స్వామి 63వ జన్మదినోత్సవ సందర్భంగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. భవ్య పర్వమ, జీయర్ పురస్కారంతో ప్రారంభమయ్యే వేడుకలు ఐదు రోజులపాటు నయనానందకరంగా సాగుతాయి.. నేడు దివ్యదేశ ఆలయ మర్యాదలు, ఆచార్య వందన సమర్పణతో పాటు జీయర్ పురస్కారాన్ని ప్రాదానం చేయనున్నారు.. ఇక 8న రామాయణ పురాణ తత్వ దర్శనం, 9వ తేదీన నిత్య గ్రంధం గీతా భాష్య సారం, 10న శ్వేతా తత్వ ఉపనిషత్ వైకుంఠ గద్యం, ఆఖరి రోజైన 11వ తేదీన కోదండ రామచంద్ర స్వామికి సహస్త్ర కలశాభిషేకం, గ్రంథావిష్కరణతో వేడుకలు పరిసమాప్తమవుతాయి. ఇలా ఐదు రోజుల పాటు చిన్న జీయర్ స్వామి తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ వేడుకల్లో రాజకీయ, సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. భక్తులకు చిన్న జీయర్ స్వామిజీ మంగళాశాసనాలు అనుగ్రహించనున్నారు.

                           36 ఏళ్లుగా సమాజానికి చిన్న జీయర్ స్వామి సేవ చేస్తున్నారని దేవానంద స్వామి తెలిపారు. సమాజానికి జ్ఙానాన్ని అందించే గ్రంధాలని 8, 9, 10 తేదీల్లో రోజుకు రెండు గ్రంధాలను ఆవిష్కరిస్తారన్నారు. చిన్న జీయర్ స్వామి 63వ జన్మదిన వేడుకలకు 15 వేలమంది భక్తులు హాజరుకానున్నారు. ఈసారి రాజమండ్రి వేద పండితులను జీయర్ పురస్కారంతో సత్కరించనున్నారు.

Chinna jeeyar swamy
Chinna jeeyar swamy News
Chinna jeeyar swamy Breakings
Chinna Jeeyar Swamy Breaking News
Chinna Jeeyar Swamy Updates
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Chinna Jeeyar Swamy Excellent Miracle Power

YOU MAY LIKE