టెస్ట్ సీరీస్ తో పోల్చిన కాంగ్రెస్

Submitted by venkateshgullapally on Tue, 11/06/2018 - 14:30
టెస్ట్ సీరీస్ తో పోల్చిన కాంగ్రెస్

కర్ణాటక ఉప ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న బిజెపిపై దేశ వ్యాప్తంగా విమర్శల దాడి తీవ్రమవుతుంది. కాంగ్రెస్ జెడిఎస్ కూటమి సాధించిన సమిష్టి విజయాన్ని బిజెపియేతర పార్టీలు స్వాగతిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి వామపక్షాల వరకు అందరు సమర్ధిస్తున్నారు. బళ్లారి లోక్‌సభ, జమఖండి అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా... మాండ్య లోక్‌సభ, రామానగరం అసెంబ్లీ స్థానాల్లో మిత్రపక్షం జేడీఎస్ గెలుచుకుంది. కీలకమైన బళ్ళారి స్థానాన్ని బిజెపి కోల్పోయంది. శివమొగ్గలో మాత్రం బీజేపీకి విజయం సాధించింది. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి యడ్యురప్ప 2014 లో ఎంపీ గా గెలిచి తర్వాత అసెంబ్లీ ఎన్నికల కోసం రాజీనామా చేసారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం స్పందించారు. ‘‘ విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్ టెస్ట్ సిరీస్ గెలిచినట్టు కర్ణాటకలో 4-1 ఫలితం కనిపిస్తోంది. కూటమి సాధించిన సమిష్టి విజయమిది..’’ అంటూ వ్యాఖ్యానించారు.

Virat Kohli
Congress
win
BJP
congress compare to congress

YOU MAY LIKE