న్యూజెర్సీలో షిరిడీ తరహాలో సాయిబాబా ఆలయ నిర్మాణం

Submitted by ganesh on Fri, 11/02/2018 - 17:05
న్యూజెర్సీలో షిరిడీ తరహాలో సాయిబాబా ఆలయ నిర్మాణం

                  న్యూజెర్సీలోని సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో షిరిడీ తరహాలో సాయి బాబా ఆలయాన్ని నిర్మిస్తున్నారు. అమెరికాలోని సాయి భక్తుల కోసం New Jersey ,ఫ్రాంక్లిన్‌ టౌన్‌ షిప్‌లో నిర్మిస్తున్న సాయిబాబా ఆలయ నిర్మాణానికి ఘనంగా భూమి పూజ జరిగింది. 

                 బాబా వారి 100 సంవత్సరాల పుణ్య తిధి సందర్భంగా సాయిదత్తపీఠం నిర్వాహకులు రఘుశర్మ శంకరమంచి, వేద పండితులు బైరవ మూర్తిల ఆధ్వర్యంలో భూమి పూజ జరిగింది.

                  షిర్డీ దేవాలయ నిర్మాణం ఎంతో కళాత్మకంగా జరగనుందని సాయిదత్తపీఠం నిర్వాహకులు తెలిపారు. హిందు సాంప్రదాయక జీవన ఆదర్శాలు ప్రతిబింబించేలా ప్రతిష్టాత్మకంగా అమెరికాలో షిరిడీ నిర్మాణం జరగనుందని పేర్కొన్నారు. 

                ముంబైకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్‌ నితిన్‌ చంద్రకాంత్‌ దేశాయ్‌ ఈ ఆలయం అచ్చం షిరిడీని పోలి ఉండేలా ప్రణాళికలు సిద్దం చేశారు.

                స్థల దాతలు, నిర్మాణ దాతల వివరాలను ఆలయ గోడల మీద లిఖించనున్నట్టు సాయిదత్తపీఠం తెలిపింది. దాతలతోపాటు ప్రత్యేక విరాళాలిచ్చే దాతల కుటుంబసభ్యుల పేర్లను  ఈ గోడలపై చెక్కిస్తారు. గురుస్థానం, లెండివనము, ద్వారకామాయి, నిత్య ధుని, చావడి సదుపాయాన్ని ఈ ఆలయంలో కూడా ఏర్పాటు చేయనున్నారు.

Sai Baba Temple
New Jersey
New Jersey News
New Jersey Updates
New Jersey Update News
New Jersey Update Breakings
New Jersey Breaking News
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Construction of Sai Baba Temple Like Shirdi in New Jersey

YOU MAY LIKE