కంట్రీ ఫుడ్స్ యూట్యూబ్ ఛానల్ బామ్మ ఇకలేరు..!

Submitted by ganesh on Wed, 12/05/2018 - 14:15
కంట్రీ ఫుడ్స్ యూట్యూబ్ ఛానల్ బామ్మ ఇకలేరు..!

                    యూట్యూబ్ లో ఆమె వంటలు చాలా ఫేమస్. ఆ బామ్మగారి రుచులకు ప్రపంచ వ్యాప్తంగా లక్షల్లో అభిమానులున్నారు. కంట్రీ ఫుడ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా లక్షలాది మందికి చేరువైన మస్తానమ్మ ఇకలేరు. వృద్ధాప్యం కారణంగా ఆమె స్వగ్రామంలో తుది శ్వాస విడిచారు. 

                     వందేళ్లు దాటిన వయసులోనూ తన వంట రుచులతో మైమరిపిస్తూ ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్న మస్తానమ్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అసలు ఇంటర్నెట్ అంటే ఏంటో తెలియని 106 ఏళ్ల బామ్మ యూట్యూబ్ లో ఎంత పాపులర్ అయ్యారో అందరికీ తెలిసిందే. యూట్యూబ్ ద్వారా నెటిజన్లకు గ్రామీణ వంటకాలను పరిచయం చేస్తూ కంట్రీఫుడ్స్ అనే యూట్యూబ్ ఛానెల్ కు లక్షలలకు లక్షల వ్యూస్ తెచ్చిపెట్టారు.. మస్తానమ్మ వంటకాలకు యూట్యూబ్ లో ఎంతో మంది ఫిదా అయిపోతున్నారు. మస్తానమ్మకు యూట్యూబ్ లో ఏకంగా 12 లక్షల మంది సబ్ స్ర్రైబర్లు ఉన్నారు.

                     గుంటూరు జిల్లా తెనాలికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నపల్లెటూరుకు చెందిన మస్తానమ్మ గురించి రెండేళ్ల క్రితం వరకూ పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పడు ఆమె తన వంటలతో ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందారు. ఆమె చేసిన పుచ్చకాయ చికెన్ ను యూట్యూబ్ లో విపరీతంగా వీక్షించారు. ఎలాంటి సౌకర్యాలు లేకుండా పచ్చని చెట్టు కింద.. పొలం గట్టుపై కట్టెల పొయ్యి మీదే సంప్రదాయ వంటన్ని వండుతూ ఈ తరానికి పాత తరం వంటకాలను పరిచయం చేసింది మస్తానమ్మ.. ఈమె వంటలకు ఏకంగా లండన్ కు చెందిన బార్ క్రాఫ్ట్ ఛాన్ ల్ నుంచి కొందరు వచ్చి మస్తానమ్మ జీవనశైలిని డాక్యుమెంటరీగా తీసుకొని వెళ్లారంటే ఆమె గుర్తింపు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

                       చిన్నతనం నుంచి వంటలకు మస్తానమ్మ ప్రసిద్ధి. మెట్టినింటికి వెళ్లిన తర్వాత గుడివాడ గ్రామంలో పలు ఇళ్లల్లో శుభకార్యాలకు తన చేతి వంటలను గ్రామస్థులకు రుచి చూపించే వారు. సుమారు ఐదు వేల జనాభా ఉన్న గుడివాడలో దాదాపు అందరికీ మస్తానమ్మ చేతివంట బాగా తెలుసు..  అయితే ఓ రోజు ఆమె వంటకాలను గమనించిన మనవడు లక్ష్మణ్ స్నేహితుడు శ్రీనాత్ రెడ్డి ఆశ్చర్యానికి గురయ్యాడు. ఆ వయసులోనూ ఆమె చాకు కూడా లేకుండా టమాటాను ముక్కలుగా  కోయడం. వేళ్లతో అల్లం పొట్టు తీయడం వంటివి వారికి ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. అంతే పల్లెటూరి పద్ధతిలో బెండకాయ కూర చేయించి పోస్టు చేశారు. అది కాస్తా వైరల్ అవడంతో మస్తానమ్మ చేత వంటలు చేయించి కంట్రీ ఫుడ్స్ అనే ఛానల్ ద్వారా పోస్ట్ చేయడం మొదలు పట్టారు. అంతే ఒక్కో వీడియోకి లక్షల్లో  వ్యూస్ పెరిగిపోయాయి..

                         వండి వార్చడంలో మస్తానమ్మకు ఎంతో అనుభవం ఉండటంతో పొయ్యి దగ్గర కూర్చుని చకచకా చేసేస్తుంది. ఆమె చేసిన ఆరవై వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ వంటల్లో పుచ్చకాయ చికెన్ కు మంచి స్పందన వచ్చింది. నెల రోజుల వ్యవధిలో ఆరు లక్షల మంది చూశారు. అలానే బెండకాయ, బ్రెడ్ ఆమ్లెట్, రోస్టెడ్ ఫ్రాన్స్ నూ ఎక్కువ మందే వీక్షించారు. టమాటో ఆమ్లెట్, ఎగ్ దోశ, చికెన్ బిర్యానీ, ఈము పక్షి మాంసం కూర పలు వంటకాల వీడియోలు కనీసం 30 లక్షల నుంచి 80 లక్షల మది చూశారు..

                        ఈమె వంటల ఛానల్ కి అమెరికా, ఇంగ్లాండ్, యూఏఈ, పాకిస్థాన్ లాంటి దేశాల్లో మస్తానమ్మకు ఎందరో అభిమానులు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తన వంటలతోనే అసంఖ్యాకంగా అభిమానులను సొంత చేసుకున్న మస్తానమ్మ సోమవారం తుది శ్వాసవిడిచారు. తన స్వగ్రామైన తెనాలి మండలంలోని గుడివాడలో వృద్ధాప్యం  కారణంగా మృతిచెందారు. అనతి కాలంలోనే అనేకమంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్న మస్తానమ్మ మృతి ఆమె వంటల్ని అభిమానించే అందరికీ లోటే..

Country Food
Youtube Old Women
youtube
old Women
Youtube Old Women News
Youtube Old Women Breakings
Youtube Old Women Breaking News
Youtube Old Women Breaking Updates
Youtube Old Women Latests
Youtube Old Women Latest News
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Country Food Youtube Old Women No More

YOU MAY LIKE