ట్రంప్ కు ఎదురుదెబ్బ

Submitted by Likhitha on Thu, 11/08/2018 - 12:46
ట్రంప్ కు ఎదురుదెబ్బ

                 అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు ట్రంప్ కు ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాన పార్టీలైన డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవటానికి పోటీ పడ్డాయి. ఈ సమరంలో ప్రతిపక్షంలో ఉన్న డెమోక్రటిక్ పార్టీ మెజార్టీ స్థానాలు సాధించి రిపబ్లికన్ పార్టీకి షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకూ తన మాటే శాసనంగా భావిస్తున్న అగ్రరాజ్యాధిపతికి పెద్ద దెబ్బే తగిలింది.

                మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ మెజర్టీ స్థానాలను గెలుచుకోవటంతో ట్రంప్ వ్యతిరేకులు సంబరాలు చేసుకుంటున్నారు. తనదైన నిర్ణయాలతో సొంత పార్టీలోనే వ్యతరేకత ఉన్నా ఎవరూ ధిక్కరించేవారు లేకపోయారు. ట్రంప్ పై వ్యతిరేకతతో స్వచ్ఛందంగా పదవులు వీడినవారు చాలా మందే ఉన్నారు. ఇప్పటికే అనేక దేశాలు ట్రంప్ నిర్ణయాలపై, ఆయన పాలనపై వ్యతిరేకంగానే ఉన్నారు. ఇప్పుడీ మధ్యంతర ఎన్నికలతో వారి వాదనకు బలం చేకూరినట్టైంది. బుధవారం విడుదలైన మధ్యంతర ఎన్నికల్లో హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్ లో ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీ మెజార్టీ సీట్లను సాధించింది. సెనేట్‌లో మాత్రం రిపబ్లికన్ పార్టీ తమ ఆధిక్యాన్ని నిలుపుకుంది.

                  అమెరికా కాంగ్రెస్‌గా వ్యవహరించే రిప్రజెంటేటివ్స్‌ హౌస్‌, సెనేట్‌లో ఈ రెండు పార్టీలే ప్రధానమైనవి. ప్రతినిధుల సభలో 435 స్థానాలకు, సెనేట్‌లోని మొత్తం 100 స్థానాల్లో 35 సీట్లకు పోలింగ్‌ జరిగింది. 36 రాష్ట్రాల గవర్నర్‌ పదవులకు, ఇతర పలురకాల పదవులకు కూడా ఎన్నికలు జరిగాయి. రిప్రజెంటేటివ్స్‌ హౌస్‌లో 435 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. విడుదలైన 412 స్థానాల ఫలితాల్లో 219 డెమోక్రాట్లు, 193 స్థానాల్లో రిపబ్లికన్లు విజయం సాధించారు. గతంలో రిపబ్లికన్లు గెలిచిన 26 స్థానాలను ఇప్పుడు డెమోక్రాట్లు దక్కించుకున్నారు. దీంతో డెమోక్రాట్లు మోజార్టీని పొంది హౌస్ లో ఆధిపత్యం పొందారు. సెనేట్‌లో మాత్రం రిపబ్లికన్లు ఆధిక్యం నిలుపుకోగలిగారు. తాజాగా సెనేట్‌లో 35 స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో ప్రస్తుతానికి 31 చోట్ల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాలు వెలువడిన తర్వాత సెనేట్‌లో రిపబ్లికన్లు 51 మంది, డెమోక్రాట్లు 45 మంది అయ్యారు. ఇందులో డెమోక్రాట్లు రెండు సీట్లను కోల్పోయారు. ఇంకా నాలుగు స్థానాల్లో ఫలితాలు వెలువడాల్సి ఉంది. 36 రాష్ట్రాల గవర్నర్‌ పదవులకు ఎన్నికలు జరగ్గా ఇప్పటికి 33 స్థానాల్లో ఫలితాలు వెలువడ్డాయి. 22 రాష్ట్రాల్లో డెమోక్రాట్లు గెలవగా, రిపబ్లికన్లు 25 స్థానాల్లో విజయం సాధించారు. అయితే డెమోక్రటిక్‌ గవర్నర్లు గతం కంటే ఏడుగురు పెరిగారు. రిపబ్లికన్లు ఏడు స్థానాలను కోల్పోయింది.

                 అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికే వివాదాలమయంగా జరిగింది. అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచీ తన వివాదాస్పద నిర్ణయాలతో ప్రపంచ దేశాల వ్యతిరేకిగా ముద్ర వేసుకున్నారు. రెండేళ్ల తన పాలనలో వివాదాస్పద నిర్ణయాలే ఎక్కువ. హెచ్ 1బీ వీసాల విషయంలో భారత్ లో అవలంబిస్తున్న వైఖరే ఇందుకు నిదర్శనం. ఇప్పుడీ మధ్యంతర ఎన్నికల ఫలితాలతో ట్రంప్ దూకుడుకు కళ్లెం పడినట్టే. కానీ ఎవరేమనుకున్నా తన దారే కరెక్ట్ అనే అమెరికన్ ప్రెసిడెంట్ కు ఇప్పటికైనా తన పాలనపై వస్తున్న వ్యతిరేకతను గుర్తిస్తారా లేదా అనేది చూడాలి.

midterm elections
Democrats
Republicans
Shock to Trump
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
Democrats Won in Midterm Elections

YOU MAY LIKE