తీవ్రమవుతున్న డెంగ్యూ జ్వరాలు

Submitted by Likhitha on Mon, 11/05/2018 - 10:04
తీవ్రమవుతున్న డెంగ్యూ జ్వరాలు

                    కర్నూరు జిల్లా ఆత్మకూరు నగర పంచాయితీలో డెంగ్యూ జ్వరాలు అంతకంతకూ తీవ్రమవుతున్నాయి. పారిశుద్ధ్యం క్షీణిస్తున్నా, పందుల తరలింపులో రాజకీయాలు మాత్రం ఆగడం లేదు. డెంగ్యూ జ్వరాలతో గత రెండు నెలల్లో ఐదుగురు చిన్నారులు చనిపోగా... ఇప్పటికీ 17 మంది కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జ్వరాలతో జనం చచ్చిపోతున్నా....  కమిషనర్ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

                    కర్నూలు జిల్లాను విష జ్వరాలు వణికిస్తున్నాయి. తొలుత సాధారణ జ్వరాలుగా భావించినా... వాటి తీవ్రత అంతకంతకూ ఎక్కువవుతోంది. రెండునెలల కాలంలో ఐదుగురు చిన్నారులు డెంగ్యూ జ్వరాలతో మృత్యువాత పడినా అధికారులు మాత్రం జిల్లాలో డెంగ్యూనే లేదని కబుర్లు చెప్తున్నారు. ఆత్మకూరు నగర పంచాయతీలో జ్వరాల ప్రభావం తీవ్రంగా ఉంది. ఆత్మకూరులో పారిశుద్ధ్యం లోపించింది. ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతోంది. దీంతో పందులు కూడా పెరిగాయి. పందులతో పాటు రాజకీయాలు కూడా పెరిగాయి.

                    ఆత్మకూరు నగర పంచాయతీలో కౌన్సిలర్లు.. పందులు పట్టే విషయంలో కూడా రాజకీయాలు చేస్తున్నారు. పందులను పట్టుకునేందుకు పంచాయతీ సిబ్బంది వెళ్లే వారిపై ఓ కౌన్సిలర్ మహిళలతో దాడులు చేయించారు. కర్రలు, స్కూటీలతో పందులు పట్టే బృందాలను వెంబడించి దాడులు చేశారు. ఆత్మకూరులోని 20 వార్డుల్లో పారిశుద్ధ్య లోపం స్పష్టంగా కనిపిస్తోంది. కుళ్లిన వ్యర్థాలు, మురుగునీటి నిల్వలతో దోమలు విజృంభిస్తున్నాయి. అయినా పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదు. పారిశుద్ద్య సిబ్బంది కొరతే దీనికి కారణంగా కనిపిస్తోంది. 

                    పంచాయతీ పరిధిలో చిన్నారుల చావులకూ తమకూ ఎలాంటి సంబంధం లేదని పీహెచ్సీ సిబ్బంది చెప్తున్నారు. కర్నూల్లో వైద్యం పొందుతూ చనిపోతే తమను ఎలా బాధ్యుల్ని చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. పంచాయతీ ఛైర్మన్ మాత్రం విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహిరించే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినా పరిస్ధితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు.

                   పారిశుద్ధ్యం మెరుగుపరచడంతో పాటు పందుల తరలింపు చేపడితే కానీ పరిస్ధితిలో మార్పు వచ్చే అవకాశాలు కనిపించడం లేదని ఆత్మకూరు స్ధానికులు చెప్తున్నారు...

Dengue Fever
Viral Fever
Spreads
Kurnool
Atmakur
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
Dengue And Viral Fever Spreads Across Kurnool
Video URL

YOU MAY LIKE