ధావన్ కోసం పోటి పడుతున్న జట్లు

Submitted by venkateshgullapally on Sun, 10/28/2018 - 17:48
ధావన్ కోసం పోటి పడుతున్న జట్లు

టీం ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్ కోసం ఐపియల్ జట్లు పోటి పడుతున్నాయి. తన స్థాయికి తగిన ధర దక్కడం లేదని భావించిన ధావన్ హైదరాబాద్ జట్టుకి గుడ్ బాయ్ చెప్పే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇటీవల భారత జట్టులో టాప్‌-4 స్థానంలో ఉన్న తనను సన్‌రైజర్స్‌ రీటైన్‌ చేసుకోలేదనే విషయాన్ని కోచ్ కి కూడా గట్టిగానే చెప్పాడు ధావన్. ఐపీఎల్-2018 వేలంలోనూ ధావన్‌ కోసం పంజాబ్ గట్టిగా ప్రయత్నించింది.

కానీ రైట్‌ టు మ్యాచ్‌ ద్వారా రూ.5.2 కోట్లకు సన్‌రైజర్స్ అతనిని తీసుకుంది. ఈ క్రమంలో ధావన్‌ను దక్కించుకోవడం కోసం ముంబయి ఇండియన్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, దిల్లీ డేర్‌డెవిల్స్‌ ఫ్రాంఛైజీలు సన్‌రైజర్స్‌తో చర్చలు జరుపుతున్నాయి. టాప్ ఆర్డర్ సమస్యతో బాధపడుతున్న ఢిల్లీ టాప్‌ ఆర్డర్‌ను బలోపేతం చేసుకునేందుకుగానూ ధావన్‌ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తుంది. మరి దీనికి అతను అంగీకరిస్తాడా అనేది చూడాలి.

shikhar dhawan
hyderabad
team india
delhi dare devils
top order
punjab
dhawan going for delhi

YOU MAY LIKE