అదరగొట్టిన ధోని

Submitted by venkateshgullapally on Sat, 10/27/2018 - 15:42
అదరగొట్టిన ధోని

5 వన్డేల సీరీస్ లో భాగంగా భారత్ విండీస్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో భారత బౌలర్లు చెలరేగిపోతున్నారు. మూడో వన్డే నుంచి జట్టులోకి వచ్చిన ఓపెనింగ్ బౌలర్ జస్ప్రిత్ భూమ్రా మొదట హేమరాజ్‌ను పెవిలియన్‌కు పంపిన అతడు.. తర్వాత పావెల్‌(21)ను కూడా ఔట్ చేశాడు. ఆ తర్వాత యువ బౌలర్ ఖలీల్ అహ్మద్ కీలక బ్యాట్స్మెన్ స్యాముల్స్ ని పెవిలియన్ కి చేర్చాడు. 14 ఓవర్లకు గాను ప్రస్తుతం మూడు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. ఇక ఇదిలా ఉంటె ఈ మ్యాచ్ లో ధోని క్యాచ్ హైలెట్ గా నిలిచింది. హేమరాజ్ క్యాచ్ ని ధోని అందుకున్న తీరు ఆశ్చర్యపరిచింది. వేగంగా పరిగెడుతూ అందుకున్న ఈ క్యాచ్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

mahendra sing dhoni
team india
oneday
jasprith bhmrah
dhoni best catch

YOU MAY LIKE