ధోని మరో అదిరిపోయే స్టంపింగ్

Submitted by venkateshgullapally on Tue, 10/30/2018 - 16:59
ధోని మరో అదిరిపోయే స్టంపింగ్

మహేంద్ర సింగ్ ధోని" ఈ పేరు వినగానే అందరికి ముందుగా గుర్తుకి వచ్చేది అతని కీపింగ్. అంతర్జాతీయంగా ధోని స్థాయిలో వేగంగా స్తుమ్ప్ అవుట్ చేసే ఆటగాడు మరొకరు లేరు. తాజాగా ఇదే విషయాన్ని నిరూపించాడు ధోని. విండీస్ తో జరిగిన నాలుగో వన్డేలో 28వ ఓవర్‌లో జడేజా బౌలింగ్‌లో ధోనీ చేసిన స్టంపౌట్‌ మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది. జడేజా విసిరిన స్లో డెలివరీకి బంతి విండీస్‌ బ్యాట్స్‌మన్‌ కీమో పాల్‌ బ్యాట్‌ను మిస్సై నేరుగా ధోని చేతుల్లో పడటం.. చాకచక్యంగా మెరుపు వేగంతో స్టంపౌట్‌ చేయడం జరిగిపోయాయి. ఆ సమయంలో పాల్‌ కాలు క్రీజుకు అంటీ అంటనట్లుగానే ఉండటంతో జడేజా కూడా ఆశ్చర్యపోయాడు. నిజంగా ఔటేనా అంటూ ప్రశ్నించాడు. అది ఔటే అన్నట్లు ధోనీ నవ్వుతూ ముందుకు కదిలాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేవలం 0.08 సెకన్లలోనే ధోని స్టంపౌట్‌ చేయడం విశేషం.

MS Dhoni
team india
over
Ravindra Jadeja
dhoni excellent stumping

YOU MAY LIKE