అతనిలో పెరుగుతున్న ఒత్తిడి

Submitted by venkateshgullapally on Sat, 11/03/2018 - 16:19
అతనిలో పెరుగుతున్న ఒత్తిడి

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అనగానే అతడిలో ఉన్న ఒక కూల్ ఆటగాడు మనకు దర్శనం ఇస్తాడు. మ్యాచ్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే కూల్ గా పూర్తి చేసి విజయాన్ని సాధించే ధోని ఇప్పుడు మాత్రం అది సాధించలేకపోతున్నాడు. కీపింగ్ చేసే సమయంలో కూల్ గానే ఉండే ధోని బ్యాటింగ్ చేసే సమయంలో మాత్రం తీవ్ర ఒత్తిడిలో కనపడుతున్నాడు. చివరి ఓవర్లలో బ్యాటింగ్ వస్తే సిక్సులతో విరుచుకుపడతాడు అనే పేరున్న మహి ఇప్పుడు బ్యాటింగ్ చేయడానికి కూడా ఇబ్బంది పడటం జట్టుకి భారంగా మారింది. గతంలో మిడిల్ ఆర్డర్ ని తన భుజాల మీద నడిపించి ఇప్పుడు అదే మిడిల్ ఆర్డర్ కి భారంగా మారిపోయాడు. ధోని చివరి 7 వన్డేల్లో వరుసగా 0, 33, 8, 36, 20, 7, 23 పరుగులు చేశాడు. ప్రపంచకప్ వరకు ధోనిని కొనసాగించే అవకాశాలు ఉన్న నేపధ్యంలో అతని ఆట నానాటికి తీసికట్టుగా మారిపోతుంది.

team india
mahendra sing dhoni
India
dhoni play for world cup

YOU MAY LIKE