రజిని సీన్ రివర్స్ అయిందా..?

Submitted by ganesh on Thu, 11/01/2018 - 16:49
రజిని సీన్ రివర్స్ అయిందా..?

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే ప్రీరిలీజ్ బిజినెస్ ఓ రెంజ్ లో జరిగిపోది. పెట్టిన పెట్టుబడికి రెండితల రాబడి ముందే వచ్చేస్తాది.ఇది ఒక్కపట్టి మాట. కాని లాస్ట్ ఇయర్ వచ్చిన రెండు సినిమాల దెబ్బతో సీన్ మారింది.ప్రజంట్ రోబో2.0 కి పెట్టుబడి పెట్టడానికి బయ్యర్లు ముందుకు రాని దుస్దితి కనిపిస్తోంది.ఇంతకి టాలీవుడ్ లో రోబో2.0 రైట్స్ ఏ డిస్టిబుషన్స్ కి సొంతమైంది?.ఎంత రేట్ కి అమ్మడు పోయింది?.టోటల్ గా ఫీల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

                      సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే ఓ సవాల్. ఆయన సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే లాభాలు ఏ స్థాయిలో వస్తాయో .. టాక్ తేడా వస్తే  నష్టాలు అదే రేంజ్ లో ఉంటాయి. గత దశాబ్దంన్నర కాలంలో రజనీ నటించిన సినిమాల్లో ‘చంద్రముఖి’.. ‘శివాజీ’.. ‘రోబో’ మాత్రమే బాగా ఆడాయి. లాభాలు తెచ్చిపెట్టాయి. మిగతా సినిమాలన్నీ బయ్యర్లను ముంచేసినవే.  దీంతో ‘2.0’ మీద  పెట్టుబడి పెట్టడానికి బయ్యర్లు ముందుకు రావడంలేదు. ఈ సినిమా తెలుగు రైట్స్  కోసం80 కోట్లకు పైగా లైకా ప్రొడక్షన్స్ ఆశించినట్లు వార్తలొచ్చాయి. ఏషియన్ సినిమాస్ వాళ్లు ఆ రేటుకు సినిమాను కొన్నట్లు కూడా చెప్పుకున్నారు. కానీ నిజానికి ఆ డీల్ ఓకే కాలేదని సమాచారం.

                       నిజానికి  ‘2.0’ విడుదలకు నెల రోజులు కూడా టైం లేని నేపథ్యంలో  దీని రైట్స్ ఎవరికి దక్కుతాయా అన్న ఉత్కంఠ పెరిగుతు వచ్చింది.అయితే ఎట్టకేలకు డీల్ సెట్టయినట్లు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్ తమకు సన్నిహిత సంబంధాలున్న ఎన్వీప్రసాద్ కే రోబో 2 విడుదల బాధ్యతలు అప్పగించింది. కాలా సినిమాకు సంబంధించి ఎన్వీ ప్రసాద్ కు 17కోట్ల వరకు వెనక్కు ఇవ్వాల్సి వుంది.అలాగే ఏషియన్ సునీల్ కు ఇవ్వాల్సిన 13కోట్ల వ్యవహారం వుంది. ఈ రెండు కలిపి 30 కోట్లు. అంటే సునీల్ కు ఎన్వీ ప్రసాద్ క్లియర్ చేస్తారన్నమాట. ఈ ముఫైకోట్లు పోగా, యాభై కోట్లు రికవరబుల్ అడ్వాన్స్ గా పంపించమని లైకా ప్రొడక్షన్స్ అడుగుతోందట. అయితే ఎన్వీ ప్రసాద్ యాభై పంపిస్తారా? లేదా నలభై పంపిస్తారా? అన్నదాన్ని బట్టి, రోబో 2 ఏ మొత్తానికి ఆంధ్రలో రికవరబుల్ అడ్వాన్స్ మీద పంపిణీకి ఇచ్చారన్నది క్లారిటీ వస్తుంది.

                       మొత్తనికి  81 కోట్లకు అమ్మాల్సిన రోబో 2 కేవలం నిర్మాణంలో ఆలస్యం కారణంగా రికవరబుల్ అడ్వాన్స్ మీద పంపిణీ చేయించుకోవాల్సి వస్తోంది.2.0’ హక్కుల్ని మొత్తంగా కొనేయకుండా.. లైకా వాళ్ల భాగస్వామ్యంతో ఆయన రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్లో పట్టున్న ప్రసాద్ సాయంతో లైకా వాళ్లే సినిమాను సొంతంగా రిలీజ్ చేస్తున్నట్లు లెక్క.మరి ఈ సినిమా పెట్టిన పెట్టుబడిని ఎంతవరకు రాబడిగా మారుస్తుందో వెచి చూడాల్సిందే.

Rajinikanth
Rajinikanth news
Superstar Rajinikanth news
Superstar Rajinikanth news News
Superstar Rajinikanth news Breakings
Superstar Rajinikanth news Breaqking News
Superstar Rajinikanth news Breaking updates
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Did Rajini Carrier Changes

YOU MAY LIKE