సముద్రతీరాల్లో మద్యం దొరుకుతుందా..?

Submitted by ganesh on Tue, 09/25/2018 - 10:07
సముద్రతీరాల్లో మద్యం దొరుకుతుందా..?

                 సముద్రతీరాల్లో మద్యం ఇక సులభంగా దొరుకుతుందా..? పర్యాటకం పేరుతో ప్రజల ప్రాణాలను గాల్లో కలపడానికి పర్యాటక శాఖ సిద్ధం అవుతుందా..?  పర్యాటకుల ప్రాణాలతో ప్రభుత్వాలకు పని లేదా..? కేవలం ఆదాయం వస్తే చాలా..? మద్యం సేవించి వాహనాలు నడిపితే తప్పైనప్పుడు.. మద్యం సేవించి సముద్ర స్నానం చేయడం తప్పు కాదా..? పశ్చిమగోదావరి జిల్లా పేరుపాలెం బీచ్ లో మద్యం అమ్మకాలకు అనుమతులపై స్పెషల్ స్టోరీ.

                ఎగిసిపడే సముద్ర కెరటాలు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఆనందాన్ని ఇస్తాయి. యువత కైతే మరింత ఉత్సాహాం ఇస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని పేరుపాలెం బీచ్ పర్యాటకంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రకృతి రమణీయ దృశ్యాలతో కనువిందు చేస్తోంది. ఉషోదయవేళలో సముద్రపు అలలు, ఇసుక తిన్నెలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మొగల్తూరు, నరసాపురం మండలాల పరిధిలో 19 కిలో మీటర్ల మేర సముద్ర తీరం ఉంది. పర్యాటక కేంద్రం పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది పేరుపాలెమే బీచ్ మాత్రమే.

                 రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి పేరుపాలెం బీచ్ వచ్చేందుకు పర్యాటకులు ఆసక్తి కనబరుస్తారు. అయితే ఈ ప్రాంతం బీచ్ కి అనువైనది కాదని ఇక్కడ ఎగిసిపడే కెరటాల్లో విద్యుత్ తరంగాలు ఉండటం వల్ల ఒక్కసారిగా భూమి గుంతలు పడి ప్రమాదాలు సంభవిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని లెక్కచేయని పర్యాటకులు ప్రతియేటా పెద్దఎత్తున ఇక్కడకు వచ్చి సముద్ర స్నానం చేసి వెళ్తుంటారు......

                అయితే ఇదంతా ఓ వైపు....  మరో వైపు బీచ్ లో మందుబాబుల ఆగడాలకు అడ్డు లేకుండా ఉంది. బీచ్ లో మద్యం సేవించి స్విమ్మింగ్ చేయకూడదని పోలీసులు హెచ్చరిస్తునే ఉన్నారు. కానీ మందుబాబులు మాత్రం పోలీసులు ఎన్ని నిబంధనలు పెట్టిన.. హెచ్చరికలు బోర్డులు తగిలించిన లెక్క చేయడంలేదు. మద్యం సేవించి సముద్రంలో ఈత కొట్టడం వల్ల అనేకమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

                ఇప్పటి వరకూ పేరుపాలెం బీచ్ లో నిబంధనలకు విరుద్ధంగా మద్యం సేవిస్తే పోలీసులు గతంలో చర్యలు చేపట్టేవారు. అయితే పర్యాటక రంగం అభివృద్ధి పేరుతో ప్రైవేటు రిసార్టుల్లో లిక్కర్ అమ్మకాలకు పర్యాటకశాఖ అనుమతులు ఇస్తుంది. బీచ్ కు సమీపంలో ఓ వైపు వెంకటేశ్వరస్వామి దేవస్థానం..మరో వైపు వేళంగిని మాత ఆలయాలు ఉన్నప్పటికీ అధికారులు మాత్రం మద్యం అమ్మకాలకు లాంఛనంగా అనుమతులిచ్చేశారు. బీచ్ ప్రాంతాల్లో లిక్కర్ ప్రియులను ఆకట్టుకునేందుకు సాక్షాత్తు హోర్డింగులనే ఏర్పాటు చేసేశారు.

                పేరుపాలెం బీచ్ రిసార్టుల్లో మద్యం అమ్మకాలను అనుమతుల మంజూరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే కార్తీక మాసంలో మందుబాబుల ఆగడాలు మరింత ఎక్కువై మహిళలకు రక్షణ లేకుండా పోతుందని ఆరోపిస్తున్నారు. తాగి వాహనాలు నడిపితే జరిమానాలు విధించే చట్టం.. తాగి స్విమ్మింగ్ చేస్తే తప్పు కాదా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి కైన పర్యాటకశాఖ ముందు చూపుతో రిసార్టులో బార్ ఏర్పాటును ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు.

              రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవరం ఎంతైనా ఉన్నప్పటికీ.. స్థానిక పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకొంటే ప్రజలు, పర్యాటకులకు ఎటువంటి సమస్యలు ఎదురుకావని ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు.

beach
Beach Bar
Beach Bar News
Bar
Wine
WINE SHOPS
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Did We Get Wine Near Beach

YOU MAY LIKE