కొత్త కథలకు వెల్ కమ్ చెప్పబోతున్న డైరెక్టర్స్

Submitted by ganesh on Thu, 11/08/2018 - 15:39
కొత్త కథలకు వెల్ కమ్ చెప్పబోతున్న డైరెక్టర్స్

                       ఇండియన్ సినిమాల్లో పాత రోత కథలకి పులుస్టాప్ పడింది. కొత్త కథలతో విచిత్రలు చేసే పరిస్దితి కనిపిస్తోంది.ఇప్పటికే రోబోలతో శంకర్ రణరంగం సృష్టిస్తుంటే...అంతరిక్షం కన్సాప్ట్ తో సరికొత్త థ్రిల్ కి వెల్ కమ్ చెప్పబోతున్నారు డైరెక్టర్స్ .ఒకటి కాదు ...రెండు కాదు...ఏకంగా 6 సిసినిమాలు స్పెస్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నాయ్.అంటే వచ్చే సీజన్ నుంచి ఇండియన్స్ సినిమాల్లో సైటిపీక్ మూవిస్ దే ఆగ్రస్థానమా?.ఇంతకి స్పెస్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమాల లీస్ట్ ఎంటి ?.దాని వేనుకున్న మ్యాటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

                       ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు హాలీవుడ్ ని ఫాలో అయిపొతోంది.మొన్నటి వరకు క్లాస్...మాస్..జోనర్స్ పై ఫోకస్ పెట్టిన డైరెక్టర్స్ ఇప్పుడు ప్రయోగాల వైపు పరుగులు పెడుతున్నారు.ఇందులో భాగంగానే ఇప్పుడు అంతరిక్షం కన్సాప్ట్ పై ఆరు సినిమాలు తెరకెక్కుతున్నాయ్.ఇందులో టాలీవుడ్ నుంచి ఎంట్రి ఇస్తోంది అంతరిక్షం 9000 కె.ఎమ్‌.పి.హెచ్.వరుణ్‌ తేజ్‌ హీరోగా సంకల్ప్‌ రెడ్డి డైరెక్షన్ లో తోలిసారిగా తెలుగులో తెరకెక్కుతున్న అంతరిక్షం నేపథ్యం ఉన్న సినిమా ఇది.అత్యున్నత సాంకేతిక విలువలతో  మిహీరా శాటిలైట్‌ నేపథ్యంలో ఈ మూవి తెరకెక్కుతోంది. రిసెంట్ గా  రిలీజ్ చేసిన టీజర్  ,పస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా పై అంచనాలు  ఎవరెస్ట్ ఎక్కాయ్.

                      తెలుగులో వరుణ్ తేజ్ అంతరిక్షంలో ప్రయోగం చేస్తుంటే...తమిళ్ నుండి ఇదే జోనర్ పై ఫోకస్ పెట్టాడు మాధవన్.ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్‌ జీవితాధారంగా రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్‌  అనే సినిమాని  తెరకెక్కిస్తున్నారు. ఇస్రోలో నంబి నారాయణ్‌ గూఢచర్యానికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీని కారణంగా ఆయన 50రోజులు జైల్లో గడిపారు కూడా. ఆ తర్వాత అతని తప్పు లేదని తెలిసి నిర్దోషిగా విడుదల చేశారు. ఇది పూర్తిగా అంతరిక్ష నేపథ్యంలో తెరకెక్కే చిత్రం కాదు. అయినప్పటికీ మిషన్‌ టు మార్స్‌ ఎపిసోడ్‌ని చాలా ఆసక్తికరంగా చూపించబోతున్నారు.

                       బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుక్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న లెటెస్ట్ మూవి జీరో. ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో షారుక్‌ మరుగుజ్జు పాత్రలో నటిస్తున్నాడు. కత్రినా కైఫ్‌, అనుష్క శర్మ గ్లామర్ డాల్స్ గా కనిపించబోతున్నారు. అయితే ఈ చిత్రం పూర్తిగా అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కించింది కాదు. తన ప్రేమను గెలిపించుకోవడం కోసం షారుక్‌ రాకెట్‌లో అంతరిక్షంలోకి వెళ్లే సన్ని వేశాలు చాలా చోట్లు ఉంటాయట.  ఇందుకోసం షారుక్‌ నాసా అనుమతి కూడా తీసుకున్నాడని సమచారం. క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

                        ఇలా ఈ మూడు సినిమాలు ఈ డిసెంబర్ లో ఆడియాన్స్ ని థ్రిల్ చేయడానికి రెడీ అయితే 2019లో ఇదే కన్పాప్ట్ తో రాబోతున్నాయ్ సారే జహా‌ సే అచ్చా ,మిషన్‌ మంగళ్ .ప్రముఖ భారత వ్యోమగామి రాకేశ్‌ శర్మ జీవితాధారంగా సారే జహా‌ సే అచ్చా తెరకెక్కనుంది.ఇందులో రీల్‌ లైఫ్‌ రాకేశ్‌ శర్మ పాత్రలో బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుక్‌ ఖాన్‌ నటిస్తున్నాడు.ఇక మిషన్‌ మంగళ్‌ విషయానికి వస్తే భారత మార్స్‌ మిషన్‌ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జగన్‌ శక్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇందులో అక్షయ్‌కుమార్‌, విద్యా బాలన్‌, తాప్సీ, సోనాక్షి సిన్హా, నిత్యా మేనన్‌ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించనున్నారు.మొత్తనికి నిన్నటి వరకు రోటిన్ రోత కథలతో ప్రేక్షకులకు చుక్కలు చూపించిన డైరెక్టర్స్ ఇప్పుడు యూటర్న తీసుకున్నారు.కొత్త కథలతో విచిత్రలు చేయడానికి రెడీ అవుతున్నారు.ఇప్పటికే శంకర్ రోబోతో కొత్త వర్షన్ కి వెల్ కమ్ చెప్పితే మిగత డైరెక్టర్స్  అంతరిక్షం పై ఫోకస్ పెంచారు.ఇప్పటి వరకు హాలీవుడ్ డైరెక్టర్స్ వరకే పరిమిత మైన ఈ  కన్సాప్ట్ ఇప్పుడు మన డైరెక్టర్స్ చేతిలోకి వచ్చింది.మరి స్పెస్ కథలు మన ఆడియాన్స్ కి ఎంత వరకు నచ్చుతాయ్యే ...బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ట్రెండ్ సృష్టిస్తాయో వెచి చూడాల్సిందే.

movie
Sankar Space Varun
varun tej
Varun Tej News Movie
Varun Tej Looks
Varun Tej Breakings
Varun Tej Breaking News
Varun Tej Updates
Varun Tej Update News
AP24x7
AP24x7 Updates
AP24x7 Latests
AP24x7 Latest News
AP24x7 Update News
ap24x7 news updates
Direcrots Are Working On New Movies

YOU MAY LIKE