ఇవాంకా సామర్ధ్యం గురించి ట్రంప్ వ్యాఖ్యలు...

Submitted by venkateshgullapally on Wed, 10/10/2018 - 17:00
ఇవాంకా సామర్ధ్యం గురించి ట్రంప్ వ్యాఖ్యలు...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన కూతురి ప్రతిభపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి పదవికి రాజీనామా చేసిన నిక్కీ హేలీ స్థానంలో నియమించడానికి తన కూతురు ఇవాంక ట్రంప్‌ గొప్ప ఛాయిస్‌ అని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ‘ఇవాంక చాలా డైనమైట్‌. ఇందులో బంధుప్రీతి ఏమీ లేదు. నేను ఇవాంక సామర్థ్యం గురించి ప్రజలకు తెలియజేయాలనుకున్నా. కానీ మీకు తెలుసు, నేను బంధుప్రీతితో చేస్తున్నానని అంతా ఆరోపిస్తారు’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. అయితే హెలి ఎందుకు రాజీనామా చేసారు అనే దానిని మాత్రం ట్రంప్ బయటపెట్టలేదు. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై ఇవాంకా క్లారిటి ఇచ్చింది.. ‘చాలా మంది గొప్ప సహచరుల మధ్య శ్వేతసౌధంలో పనిచేయడం గౌరవంగా ఉంది. రాయబారి హేలీ స్థానంలో అధ్యక్షుడు తగిన వ్యక్తిని నియమిస్తారు. అది నేను కాదు’ అని ఇవాంక ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. కాగా ఇవాంక, ఆమె భర్త జేర్డ్‌ కుష్నర్‌ వైట్‌హౌస్‌లో ఉన్నత స్థాయి సలహాదారులుగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే.

Ivanka Trump
Donald Trump
america
twitter
donald trump comments on ivanka trump

YOU MAY LIKE