దుర్గగుడిలో మొమెంటోల వివాదం...

Submitted by Likhitha on Mon, 11/05/2018 - 14:37
దుర్గగుడిలో మొమెంటోల వివాదం...

                       దుర్గగుడిలో మొమెంటోల వివాదం మరింత ముదురుతోంది. మొమెంటోల కొనుగోలులో అవకతవకలపై ఏఈవో అచ్యుత రామయ్యను ఈవో కోటేశ్వరమ్మ విధుల నుంచి సస్పెండ్ చేశారు. అయితే అవకతవకలపై వివరణ అడిగినందుకు తనపై ఏఈవో దుర్భాషలాడారంటూ ఈవో కోటేశ్వరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అచ్యుతరామయ్యపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈవో కోటేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు ఏఈవో అచ్యుతరామయ్య పోలీసుల ఎదుట హాజరయ్యారు.. ఈవో కోటేశ్వరమ్మ తనను కావాలనే ఇరికిస్తోందని ఆరోపించారు. మొమెంటో కొనుగోలు విషయంలో తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు. తన సస్పెన్షన్ పై ఎటువంటి ఉత్తర్వులు అందలేదని.. ఈవివాదంపై అంతా అమ్మవారే చూసుకుంటురంటున్నారు. 

Durga Temple
EO
Koteswaramma
suspend
AEO
Auchyuta Ramaiah
Momento Controversy
vijayawada
Indrakiladri
Kanakadurga Temple
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
Durga Temple EO Koteswaramma Suspend AEO Auchyuta Ramaiah

YOU MAY LIKE