ఈ ప్రభావం వాటిపై పడుతుందా..?

Submitted by venkateshgullapally on Tue, 11/06/2018 - 14:29
ఈ ప్రభావం వాటిపై పడుతుందా..?

కర్ణాటకలో జరిగిన ఉప ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆ ప్రభావం త్వరలో జరగబోయే హింది రాష్ట్రాల ఎన్నికలపై పడుతుందా..? అంటే అవుననే సమాధానం వినపడుతుంది, 5 స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగితే కేవలం ఒక స్థానంలోనే బిజెపి విజయం సాధించింది. కీలకమైన బళ్ళారి స్థానాన్ని కూడా ఆ పార్టీ చేజార్చుకోవడంతో హింది రాష్ట్రాల ఎన్నికలపై ఈ ప్రభావం పడుతుందని అంటున్నారు పరిశీలకులు. రాజస్థాన్ , మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బిజెపిపై తీవ్ర వ్యతిరేకత ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్కడ విజయం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తుంది బిజెపి అధిష్టానం. ఇప్పుడు కర్ణాటకలో జరిగిన ఉప ఎన్నికల్లో ఈ షాక్ తో బిజెపి ఓడిపోవడంతో బిజెపి అధిష్టానంలో భయం మొదలయింది. అటు కర్ణాటకలో కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో జెడిఎస్ కాంగ్రెస్ కూటమి కలిస్తే మాత్రం బిజెపి విజయం సాధించడం కలే అంటున్నాయి రాజకీయ వర్గాలు.

hindhi state
ELECTIONS
madyapradesh
effect on hindhi state elections

YOU MAY LIKE