త్వరలో అందుబాటులోకి విద్యుత్ కార్లు

Submitted by ganesh on Mon, 08/27/2018 - 10:39
త్వరలో అందుబాటులోకి విద్యుత్ కార్లు

               రాష్ట్ర రోడ్లపై ఎలక్ట్రిక్ కార్లు పరుగులు పెట్టనున్నాయి. విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాల్లో ఈ-కార్లు దర్శనమివ్వనున్నాయి. తొలుత ప్రభుత్వ సంస్థలకు వీటిని కేటాయిస్తున్నారు. భవిష్యత్ లో వ్యక్తిగత వాహనాల సంఖ్యను పెంచే విధంగా ప్రభుత్వం రాయితీలు కల్పించనుంది.

               కాలుష్యం, పెట్రో ధరల సమస్యలను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టబోతోంది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ కార్ల వాడకాన్ని ప్రోత్సహిస్తోంది. తొలుత ముఖ్యమైన నగరాల్లో ఈ-కార్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. మున్సిపల్ కార్పొరేషన్లు, ఈస్ట్రన్, సదరన్ పరర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు కార్లను కేటాయించనున్నారు.  ఏడాది వ్యవధిలో అన్ని ప్రభుత్వ సంస్థలకు ఎలక్ట్రిక్ వాహనాలను కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఈఈఎస్ఎల్ సమకూర్చనుంది.  పొల్యూషన్ ఫ్రీ ఈ-కార్లను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన విధానంలో కొత్తగా కొన్ని మార్పులు చేయనున్నారు. 

              వ్యక్తిగత ఎలక్ట్రిక్ వాహనాలను ప్రొత్సహించడం కోసం కొన్ని రాయితీలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ-కార్లకు రిజిస్ట్రేషన్ ఛార్జితో పాటు రోడ్ ట్యాక్స్ నుంచి మినహాయింపులివ్వనున్నారు. నెడ్‌క్యాప్‌ చేసుకున్న ఒప్పందంపై ఈఈఎస్‌ఎల్‌ ఇప్పటికే రాష్ట్రానికి పంపిన 300 ఎలక్ట్రిక్‌ వాహనాలను బయటకు తీస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, రోడ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు కల్పిస్తుండటంతో వ్యక్తిగత వాహనాల సంఖ్య భారీగా పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వచ్చే ఐదేళ్లలో 7 లక్షల నుంచి 10 లక్షలకు పెరిగే అవకాశముంది.  ఎలక్ట్రిక్ కార్లను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు వివిధ కంపెనీలతో అధికారులు చర్చలు జరుపుతున్నారు.

             ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.  ఇందుకోసం విద్యుత్ సంస్థల ఆధ్వర్యంలో 50 ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే విశాఖలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఛార్జింగ్ స్టేషన్ ను ప్రారంభించారు. మరో రెండు నెలల్లో మరిన్ని ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. పెట్రోల్, డీజిల్ బంకులకు అనుబంధంగా ఏర్పాటు చేసే రీ ఛార్జింగ్ కేంద్రాలకు ప్రభుత్వం రాయితీలు కల్పించనుంది. ఎలక్ట్రిక్‌ వాహన తయారీ సంస్థలను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం స్పెషల్ క్లస్టర్‌ను తీసుకొచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, ఆటో మొబైల్‌ తరహాలో ప్రత్యేకంగా ఎలక్ట్రిక్‌ వాహన తయారీ కంపెనీల కోసం 2 వేల ఎకరాల్లో క్లస్టర్‌ ఏర్పాటు బాధ్యతను ఏపీఐఐసీకు అప్పగించారు. కార్ల తయారీ కంపెనీలను ఆకర్షించేందుకు ప్రత్యేక పాలసీని కూడా ప్రభుత్వం తీసుకురానుంది. దీనివల్ల వాహన ధరలు అందుబాటులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు.

             ఎలక్ట్రిక్ కార్ల వల్ల కాలుష్య సమస్య తలెత్తే అవకాశం లేదు.  పెట్రోల్ తో నడిచే కార్లకు కిలోమీటర్ కు 3 రూపాయల నుంచి 4 రూపాయల వరకు ఖర్చవుతోంది. అదే విద్యాత్ ఛార్జింగ్ తో నడిచే కార్లకు రూపాయికే కిలోమీటర్ దూరం వెళ్లొచ్చు. ఈ-కార్ల కోసం యూనిట్ విద్యుత్ ధరను 6 రూపాయల 95 పైసలుగా ఖరారు చేశారు.  ఒక్కో వాహనంలో 15 నుంచి 17 యూనిట్లు ఛార్జింగ్‌ అయ్యే బ్యాటరీలు ఉంటాయి . ఒకసారి ఛార్జి చేస్తే సుమారు వంద కిలో మీటర్ల దూరం ప్రయాణించొచ్చు. 
స్పాట్ విత్ మ్యూజిక్

Electrics Cars
Roads
vijayawada
Electrics Cars News
Electrics Cars Breakings
Electrics Cars Breaking News
Electrics Cars Updates
Electrics Cars Update News
Electrics Cars News Updates
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Electrics Cars Are Coming Soon On Roads

YOU MAY LIKE