నిధుల గోల్ మాల్...ఉద్యోగులు గరం గరం

Submitted by ganesh on Fri, 11/09/2018 - 11:28
నిధుల గోల్ మాల్...ఉద్యోగులు గరం గరం

                    దీపావళి పేరుతో నిధుల గోల్ మాల్ కథ విశాఖ స్టీల్ ప్లాంట్ లో పునరావృతమైంది.. నిబంధనలు పక్కన పెట్టి బాణసంచా విక్రయాలతో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు గరం గరం అవుతున్నారు. కార్మికులకు తక్కువ ధరలకు విక్రయించాల్సిన బాణసంచాను అధిక ధరలకు బయటకు వారికి అమ్ముకున్నారంటూ ఫైరవుతున్నారు.. స్టీల్ కో ఆపరేటివ్ స్టోర్స్ పాలకమండలి సభ్యులు జేబులు నింపుకుని స్టీల్ ప్లాంట్ ఖజానాకు చిల్లు పెట్టారని మండిపడుతున్నారు.

                       అటు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటంపై స్థానికులు కూడా మండిపడుతున్నారు. కోపరేటివ్ స్టోర్స్ అంబేద్కర్ కళాక్షేత్రం లో టపాసులు కొన్నవారు, తిరిగి వచ్చేవారికి ఎంట్రన్స్ ఒకటే ఉండటంతో ప్రమాదానికి కారణంగా మారింది. అక్రమక దారులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి..

                         గతంలోనూ బాణసంచా విక్రయాల సందర్భంగా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పోలీసులు, ఫైర్, రెవెన్యూ అధికారులు మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. తాజా ఘటన పై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు..?

Steel Plant
Steel Plant News
Steel Plant Breakings
Steel Plant Breaking News
Steel Plant Updates
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
employees Fires Owners

YOU MAY LIKE