రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని అంతా అనుకున్నారు..

Submitted by sagar on Thu, 12/06/2018 - 11:45
Nelakantam

 

రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని అంతా అనుకున్నారు.. గుర్తుతెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. కుటుంబసభ్యులు,బంధువుల సమక్షంలో శాస్త్రోక్తంగా అంత్యక్రియలు పూర్తిచేశారు.  కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కుటుంబం మొత్తం తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయింది. కట్ చేస్తే  చనిపోయాడనుకున్న వ్యక్తి సజీవంగా కనిపించాడు.  పక్క ఊర్లో అతన్ని చూసిన వ్యక్తులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో వారంతా  సంబ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.   చనిపోయాడనుకున్న వ్యక్తి బ్రతికే ఉండండంతో సంతోషంలో మునిగితేలుతున్నారు. అయితే ఇంతకీ అంత్యక్రియలు నిర్వహించిన ఆ మృతదేహం ఎవరిది.. పొరపాటు ఎక్కడ జరిగింది.

నీలకంఠం సజీవంగా తిరిగొచ్చాడు ఇంతవరకు ఓకే.. మరి గ్రామస్తులు అంత్యక్రియలు నిర్వహించిన మృతదేహం ఎవరిది ..? పొరపాటు ఎక్కడ జరిగింది. ఇప్పుడిదే అందర్నీ వేధిస్తున్న ప్రశ్న. నీలకంఠం తిరిగొచ్చినందుకు ఆనందపడేలోపే వార్ని మరో బాధ వెంటాడుతోంది. తాము అంత్యక్రియలు నిర్వహించిన మృతదేహం ఎవరిది అన్న ప్రశ్న వారిని వెంటాడుతోంది.

Nelakantam        మీరు చూస్తున్న ఈయన పేరు నీలకంఠం .. కర్నూలు జిల్లా డోన్ మండలం గుమ్మకొండ గ్రామానికి చెందిన ఈయనకు ముగ్గురు సంతానం.  చంద్రన్న, రాముడు, సోమేష్ గౌడ్  లో మొదటి ఇద్దరు కుమారులు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మూడో కోడుకు వ్యాపారం చేసేవాడు. అనారోగ్యంతో ఇటీవలే మృతిచెందాడు. మూడోకొడుకు  సోమేష్ గౌడ్ వద్దే నీలకంఠం ఉండేవాడు.. ఏడాది క్రితం మూడో కుమారుడు సోమేష్ చనిపోయినా కోడలు వద్దే ఉంటున్నాడు. నెల నెలా తనకొచ్చే వృద్ధాప్య పించన్ తో  సమీప పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు.  10 రోజుల కిందట ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి నీలకంఠం కుటుంబ సభ్యులకు ఫోన్ వచ్చింది. నంద్యాల సమీపంలో రైలులో ప్రమాణిస్తూ నీలకంఠం మతిచెందాడని సమచారం అందించారు. కుటుంబసభ్యులు నంద్యాలకు వెళ్లి చూస్తే.. తలభాగం నుజ్జు నుజ్జు అయి ఉంది. మృతదేహాంపై కటుంబసభ్యులకు సందేహాలు వ్యక్తం అయ్యాయి. అయితే కొందరు నీలకఠం గౌడే అని నిర్దారించుకొగా, మరికొందరు కాదని వాదనలకు దిగారు.  చివరికు అతను కట్టుకున్న  పంచె, కాలికి చర్మసంభమైన రోగాన్ని చూసి పోలీసులకు వివరించగా.మృతదేహాన్ని కటుంబసభ్యులకు అప్పగించారు.  దీంతో ఆ మృతదేహాన్నిసొంతూరుకి తరలించి శాస్త్రోక్తంగా అంతక్రియలు నిర్వహించారు. కుటుంబ పెద్దదిక్కు కొల్పోయామని బాధపడుతూ పెద్దకర్మ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

        గుమ్మకొండలో నీలకంఠం చనిపోయాడని అంతా భావిస్తుంటే.. అతను డోన్ లో సజీవంగా కనిపించాడు.   గుమ్మకొండ నుంచి కొందరు వ్యాపారస్తులు నిత్యం కాయగూరలు, ఆకుకూరలు  డోన్ కు తీసుకువచ్చి అమ్ముకొని తిరిగి వెళ్లేవారు. ఈ క్రమంలో కొందరికి చనిపోయాడనుకున్న నీలకఠం గౌడ్ డోన్ రైల్వే స్టేషన్ లో కనిపించాడు. దీంతో ఒకింత అశ్చర్యానికి గురైయ్యారు. ఇదే విషయాన్ని గుమ్మకొండలోని నీలకఠం గౌడ్ కుటుంబసభ్యులకు తెలియజేశారు. అయితే వ్యాపారస్థుల  వాదనను కుటుంబసభ్యులు కొట్టిపారేసారు ఎవర్నో చూసి మరేవరో అనుకుంటున్నారని హేళన చేశారు.  చివరికి డిసెంబర్ ఒకటిన నీలకంఠమే ఊర్లోకి వచ్చేశాడు.  ప్రభుత్వం ఇచ్చే పించన్ తీసుకునేందుకు వచ్చిన నీలకంఠాన్ని చూసి కుటుంబసభ్యులు , గ్రామస్థులు మొదట షాక్ కి గురయ్యారు. ఆ తర్వాత ఆనందంలో మునిగితేలుతున్నారు.

        చనిపోయాడని అంత్యక్రియలు ముగించిన కుటుంబసభ్యులకు నీలకఠం గౌడ్  గ్రామానికి రావటంతో కుటుంబసభ్యులు అమోమయానికి గురైయ్యారు. ఈ గండం నుంచి గట్టెక్కెందుకు కుటుంబసభ్యులు ఓ పురోహితుని అశ్రయించిన్నట్టు సమచారం.. తమ కుటుంబ పెద్దదిక్కు నీలకఠం గౌడ్ మతదేహాంగా  భావించి, గుర్తుతెలియని శవానికి అంత్యక్రియలు నిర్వహించామని, పురోహితుని దష్టికి తేగా..ఇంతటితో చేపట్టిన కార్యక్రమలతోనే అపేయండని, ఇక 11 రోజుల తరువాత చేపట్టబోయే కార్యక్రమాన్ని చేపట్టకండి అని పురోహితుడు నీలకఠం గౌడ్ కుటుం సభ్యులకు సూచించిన్నట్టు తెలుస్తోంది..అయితే ఈ అంశంపై వాస్తవాన్ని తేల్చే ప్రయత్నంలో భాగంగా ఎపీ 24/7 ప్రతినిధులు గుమ్మకొండ గ్రామానికి చేరుకొగా నీలకఠం గౌడ్ కుటుంసభ్యులు..బంధువులను ఆరా తీయగా.. గుర్తుతెలియని శవాన్ని తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించిన మాట వాస్తవమే ఆంగీకరించారు.  ఫించన్ కోసం నీలకఠం గుమ్మంకొండకు వస్తారన్న సమచారంతో రెండు రోజుల నుంచి ఆయన కోసం కాపుకాయగా సోమవారం గ్రామసచివాలయం వద్ద నీలకఠం గౌడ్ ను, ఎపీ 24/7 తరుపున మాట్లాడించే ప్రయత్నం చేయగా, నేను చనిపోయానని ఎవరిదో మృతదేహాన్ని తీసుకువచ్చి పూడ్చిపెట్టారని, ఇదంత అయిపోయిన వ్యవహారమని నీలకఠం గౌడ్ తేలికగా కొట్టిపారేశారు. పైగా ఫించన్ పంపిణీలో జరగుతున్న అవినీతిపై తేల్చండని నీలకఠం గౌడ్ మీడియా ప్రతినిధిని కొరారు. నెల నెల ఫించన్ పుచ్చుకొవాలంటే 10 రూపాయల నుంచి 20 రూపాయలు ముట్టజెప్పాల్సివస్తోందిని, మెదట అక్రమ వసూలుపై స్పదించడని కొరారు.

        సహాజంగా ఎదైనా ప్రమాద ఘటనలు జరిగినప్పడు..ఆయా ప్రాంత పరిధిలోని పోలీసులు మెదట మృతదేహాన్ని పరిశీలించాలి. పేపర్లలో గుర్తుతెలియని వ్యక్తి మృతి ఫోటోతో సహా ప్రచురిస్తారు.  ఎవైనా ఆధారాలు లభించితే బాధ్యులైన కుటుంబసభ్యులకు సమచారాన్ని చేరవేయాలి. అనంతరం మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలిస్తారు. అక్కడ పోస్టుమర్టం జరిపి..బాధిత కుటుంబసభ్యులకు అప్పగిస్తారు. ఇది సహాజంగా జరిగే పక్రియ..అయితే ఇక్కడ మాత్రం గుర్తుతెలియని శవానికి అంత్యక్రియలు నిర్వహించటంపై నీలకఠం గౌడ్ కుటుంబసభ్యులు సరైన రీతిన ఆధారాలతో అశ్రయించారా లేక.. మతదేహాన్ని వదిలించుకొవాలన్న ఉద్దేశ్యముతో  గుర్తుతెలియని శవాన్ని అంటగట్టారా అన్నది తేలాల్సి ఉంది.

ఓ ప్రమాద ఘటనలో తమ కుటుంబపెద్దదిక్కు మృతిచెందాడని సమచారంతో  మృతదేహాని కుటుంబసభ్యులు,బంధువుల సమక్షములో శాస్తోక్తంగా అంత్యక్రియలు జరిపారు. పెద్దదిక్కును కొల్పోయామన్న బాధత కుటుంబసభ్యులు తదుపరి రోజుల్లోచేపట్టాల్సిన కార్యక్రమంలో నిమగ్నమైయ్యారు. ఈలోగా పుడ్చిపెట్టినట్టు చెప్పుకొబడే తమకుటుంబ పెద్దదికైన నీలకఠం గౌడ్ సజీవంగా ఉండటాన్ని కొందరు గ్రామస్తులు చూసి అశ్యర్యానికి లోనైయి బాధిత కుటుంబసభ్యులకు తెలిపారు. అంత్యక్రియలు జరిపిన వ్యక్తి ఎవరైయి వుంటారని కుటుంబ సభ్యులు ఆందోళనలో పడ్డారు. సరిగ్గా ఇదే సమయంలో చనిపోయడని అంత్యక్రియలు నిర్వహించిన నీలకఠం గౌడ్ అనే వద్దుడు గ్రామంలో ప్రత్యక్షమైయ్యారు. గ్రామంలో తొందరపడి గుర్తుతెలియని ఓ శవాన్ని తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించిన కుటుంసభ్యులపై చర్చ జోరుగా సాగుతుంది.

Nelakantam
Kurnool district
kurnool news
gummakonda
Everything seems to have died in a road accident.
Video URL

YOU MAY LIKE