విష ఆహరం కారణంగా 40 మందికి అస్వస్థత

Submitted by ganesh on Sat, 11/03/2018 - 18:34
విష ఆహరం కారణంగా 40 మందికి అస్వస్థత

                        నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లోని సాంఘిక సంక్షేమ డిగ్రీ కళాశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యి నలభై మంది విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో విషయం తెలుసుకున్న కళాశాల సిబ్బంది... ప్రభుత్వాస్పత్రి వైద్యులకు సమాచారం అందించారు. వైద్యులు కాలేజీలోనే విద్యార్ధులకు వైద్య పరీక్షలు చేసి, వైద్యం అందించారు. రాత్రి విద్యార్ధులకు ఐరన్ మాత్రలు ఇవ్వడం జరిగిందని, అయితే మాత్రలు వేసుకున్న తరువాత భోజనం చేసిన విద్యార్ధులకు మాత్రమే ఫుడ్ పాయిజన్ అయ్యిందని కళాశాల ప్రిన్సిపల్ ఆంజనేయులు తెలిపారు. విద్యార్ధినిలు కోలుకుంటున్నారని వైద్యులు అశోక్ తెలిపారు.

Food Poison
Armoor Social Welfare Hostel
Nizamabad District
Armoor Girls Hostel Issue
Food Poison In Girls Hostel
#AP24x7
#AP24x7live
#AP24x7news
AP24x7 telugu news
Food Poison In Armoor Social Welfare Hostel
Video URL

YOU MAY LIKE