ఎవరీ చిక్కకుండా పారిపోయిన గాలి అండ్ కో

Submitted by ganesh on Fri, 11/09/2018 - 12:58
ఎవరీ చిక్కకుండా పారిపోయిన గాలి అండ్ కో

                    గాలిజనార్దన్ రెడ్డి ఏమయ్యాడు..? ఈడీ కేసులో ఉచ్చు బిగుస్తుండడంతో బెంగళూరులో కనిపించకుండా పోయిన గాలి ఎక్కడ తలదాచుకున్నాడు..  విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లా సైలెంట్ గా విదేశాలకు చెక్కేశాడా ...?  రెండు రోజులుగా గాలిస్తున్నా ఆచూకీ చిక్కలేదంటే  ఎక్కడికైనా జంప్ అయ్యాడా..?  ఇప్పుడు ఇవే అనుమానాలు బలపడుతున్నాయి.

                        ఈడీ అధికారులకు లంచం ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారన్న కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మైనింగ్ డాన్ గాలి జనార్ధనరెడ్డి కోసం గాలింపు కొనసాగుతోంది. కేసు బయటికొచ్చినప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు. తన ఆచూకీకి సంబంధించిన చిన్న క్లూ కూడా ఎవరికీ చిక్కకుండా ఆయన జాగ్రత్త పడ్డారు. దీంతో గాలి కేసు పోలీసులకు సవాల్ గా మారింది. తనను అరెస్ట్ చేస్తారన్న విషయాన్ని ముందుగానే పసిగట్టిన గాలి జనార్ధనరెడ్డి తెలివిగా తప్పించుకున్నారు. ఐతే గాలి స్వదేశంలోనే ఉన్నారా., లేక విదేశాలకు పారిపోయారా అనేది తెలియడం లేదు.

                        ఇక గాలి జనార్దన్ రెడ్డి కంపెనీ కోసం లంచం ఇచ్చారో కంపెనీని  బెంగళూరులోని డీజే హళ్లి  ప్రాంతంలో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించింది. తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే లాభాల రూపంలో నెలకు 30 నుంచి 40శాతం రిటర్న్‌లు ఇస్తామని నమ్మించింది. హామీలు నమ్మి వేలాది మంది కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. కంపెనీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదుదీంతో 2017లో అంబిడెంట్కంపెనీపై కేసులు నమోదయ్యాయిప్రజలు పెద్ద ఎత్తున బెంగళూరు సిటీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసుపై దర్యాప్తును ప్రారంభించారు. కేసు నుంచి తప్పించేందుకు గాలి అండ్ కో 20 కోట్ల 50 లక్షలు డిమాండ్ చేయగా.. రమేష్కొఠారి అనే వ్యక్తి ఖాతాకు అంబిడెంట్కంపెనీ రూ.18కోట్లు బదిలీ చేసినట్లు గుర్తించారు. రమేష్ కొఠారిని ప్రశ్నించగా తాను 57 కిలోల బంగారాన్ని బళ్లారికి చెందిన రమేష్‌కు ఇచ్చినట్లు చెప్పాడు. అతను  నగల దుకాణాన్ని నిర్వహిస్తుంటాడు. అతన్ని ప్రశ్నించగా.. తాను రమేష్నుంచి 57 కిలోల బంగారాన్ని తీసుకుని జనార్దన్‌రెడ్డి పీఏ అలీఖాన్‌కు ఇచ్చినట్లు ఒప్పుకున్నాడుఇలా గాలి జనార్దన్ రెడ్డి కి కేసుకి లింకు కుదిరింది. కేసు నుంచి తప్పించుకోవడానికే గాలి జనార్దన్ రెడ్డి కోటి రూపాయలు ఈడీకి లంచం ఇచ్చినట్లు తేలింది.. దీంతో గాలికోసం ఈడీ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
                          గతంలో పోర్టుల ద్వారా ఐరన్ ఓర్ ను చైనాకు ఎగుమతి చేసిన గాలి జనార్ధన రెడ్డి ఇప్పుడు అదే పోర్టుల ద్వారా విదేశాలకు వెళ్లి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐతే గాలి జనార్ధనరెడ్డి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆయన ఏపీలోనే ఉన్నట్లు తెలుస్తోంది. రాయలసీమ ప్రాంతంతో అనుబంధమున్న గాలికి అక్కడివారే సహకరించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఐతే గాలి విదేశాలకు పారిపోయాడా.. లేక ఎక్కడైనా తలదాచుకుంటున్నాడా అనేది విచారణలో చేలనుంది.

Gali Janardhan Reddy
Gali Janardhan Reddy news
gali janardhan reddy Breakings
Gali Janardhan Reddy breaking news
gali janardhan reddy Update News
gali janardhan reddy News Updates
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Gali janardhan Reddy Escapes

YOU MAY LIKE