గంగూలీ సంచలన వ్యాఖ్యలు

Submitted by venkateshgullapally on Tue, 10/30/2018 - 19:32
గంగూలీ సంచలన వ్యాఖ్యలు

బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) సీఈవో రాహుల్ జోహ్రీపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై టీమిండియా మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భారత క్రికెట్ లో లైంగిక వేధింపులపై కీలక వ్యాఖ్యలు చేసాడు. భారత క్రికెట్ ప్రమాదంలో పడిందన్న గంగూలీ.. బీసీసీఐ యాక్టింగ్ ప్రెసిడెంట్ సీకే ఖన్నా, సెక్రటరీ అమితాబ్ చౌదరి, ట్రెజరర్ అనిరుధ్ చౌదరీలకు రాసిన మెయిల్ లో పరిపాలక మండలి (సీఓఏ) వైఖరి ఆందోళన కలిగిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేసాడు.

జోహ్రీ కేసులో కార్యాచరణపై సీఓఏ సభ్యులు మాజీ సీఏజీ వినోద్ రాయ్, మాజీ మహిళా క్రికెటర్ డయానా ఎడుల్జీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటం ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించాడు. జోహ్రీకి మాజీ సహచరురాలైన ఓ మహిళ లైంగిక వేధింపుల వ్యవహారాన్ని ట్విట్టర్ లో  బయట పెట్టిన సంగతి తెలిసిందే. కాగ అక్టోబర్ 25న సీఓఏ రాహుల్ జోహ్రీ లైంగిక వేధింపులపై దర్యాప్తునకు ముగ్గురు సభ్యుల ప్యానెల్ ను ఏర్పాటు చేయగా జోహ్రీని తొలగించాల్సిందేనన్న ప్యానెల్ నిర్ణయించింది. దీనికి చైర్మన్ వినోద్ రాయ్ అడ్డుపడ్డారు.

sourav ganguly
BCCI
twitter
Cricketer
ganguly sensational comments

YOU MAY LIKE