బంగారు అభరణాలు...

Submitted by ganesh on Sun, 08/19/2018 - 12:06
బంగారు అభరణాలు...

               క‌ళ్లు జిగేల్ మ‌నిపించే బంగారు అభ‌ర‌ణాలు..సొగ‌సుకు త‌గ్గ వ‌డ్ణాణాలు..మ‌తిపొగొట్టే న‌క్లెస్ లు..ఇంకా మ‌రెన్నో ఆర్నమెంట్స్ సిటీలోని జువెల్ల‌రీ షోరూముల్లో మ‌గువ‌ల‌ను కట్టిపడేస్తున్నాయి. ఎన్నో డిజైన్‌లు ఉన్నా   ఒక్కొక్క‌టి మాత్ర‌మే ఉండ‌డంతో ఇప్పుడు మ‌హిళ‌లంతా వాటిని కొనేందుకు గోల్డ్ షాపుల్లో బిజీ బిజీగా ఉంటున్నారు...సిటిలో కొత్త‌గా ఏర్పాటు చేసిన అర్టీస్ట్రీజువెల్ల‌రీ పై మ‌న‌సు పారేసుకుంటున్నారు..అంత స్పెష‌ల్ ఎంటో మ‌నము చూద్దాం.

             బంగారు నగలంటే మగువలకు ఎంతో ఇష్టం నచ్చిన నగలు ధరించి నిలువుటద్దంలో చూసుకుంటూ మురిసిపోతుంటారు. ఇక ఇంట్లో ఏ శుభకార్యమైనా అభరణాలు జిగేల్ మనాల్సిందే. అందుకే ఎన్నో డిజైన్లు మరేన్నో మోడళ్లు నిత్యం అందుబాటులోకి వస్తుంటాయి. ఎన్ని వెరైటీలున్నా నిత్యం కొత్తకొత్త డిజైన్లతో ముందుకొస్తున్నారు తయారీదారులు. శ్రావణమాసం అందునా పెళ్లిళ్ల సీజ‌న్‌ కోసం  అర్టీస్ట్రీ జ్యువెల్ల‌రీ పేరుతో స్పెష‌ల్ ఎగ్జిబిష‌న్స్‌ను కండ‌క్ట్ చేస్తున్నారు బెజవాడ సిటీలోని గోల్డ్ షాపు నిర్వహకులు. స్పెషల్ కస్టమర్లకోసం రేర్ అండ్ యూనిక్ డిజైన్స్ ను మాత్ర‌మే అందుబాటులో ఉంచుతున్నారు.

              పెళ్ళిళ్ల సీజన్ కోసం గత కొన్ని రోజులుగా ఇతర నగరాలనుంచి అక్క‌డి ట్రెడిష‌న్ అండ్ క‌ల్చ‌ర్ కి త‌గిన జ్యువెల్ల‌రీ ని ఇప్పుడు సిటిలోని గోల్డ్ అండ్ ప్యాష‌న్ ల‌వ‌ర్స్ కోసం తెప్పిస్తున్నారు నిర్వ‌హాకులు. దానికి త‌గ్గ‌ట్టు క‌స్ట‌మైజెడ్ జ్యువెల్ల‌రీని కూడా న‌చ్చిన రీతిలో ఆర్డ‌ర్స్ పై అందిస్తున్నారు..

             ఏరా, ఎథ్నిక్‌, టెంపుల్‌, ప్రికా, డైమండ్స్‌, పోల్కి జ్యువెల్ల‌రీ క‌లెక్ష‌న్‌, క‌ల‌ర్ డైమండ్ జ్యువెల్ల‌ర్స్, రోస్ క‌ట్ డైమండ్స్‌, జెమ్ స్టోన్స్‌. ఓల్డ్ మైన్ క‌ట్స్ అభ‌ర‌ణాలు ప్ర‌త్యేకంగా మ‌గువ‌ల మ‌న‌సు దోచేస్తున్నాయి.. ఈ క‌లెక్ష‌న్స పార్టీవేర్‌, వెడ్డింగ్ వేర్ కి త‌గ్గ‌ట్టు యూనిక్ డిజైన్‌లో అందుబాటులో ఉంచారు.

             శ్రావణమాసంలో పెళ్లిల్లు ఎక్కువగా ఉండ‌డంతో ఈ టైపు జ్యువెల్ల‌రీకి మరింత క్రేజ్ ఉంది..ప‌ది మందిలో స్పెష‌ల్ గా క‌నిపించేందుకు ఇంట్రెస్ట్ చూపించే మ‌గువ‌లు ఈ జ్యువెల్ల‌రీ చూసి సంబర‌ప‌డిపోతున్నారు.

Jewellery
Gold Jewellery
Gold Jewellery News
Gold Jewellery Updates
Gold Jewellery Breakings
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Gold Items...

YOU MAY LIKE