కన్ను తెరిస్తే జననం...కన్ను మూస్తే మరణం...

Submitted by ganesh on Tue, 12/04/2018 - 12:02
కన్ను తెరిస్తే జననం...కన్ను మూస్తే మరణం...
  •  ఏ దిక్కూ లేని వారికి పెద్ద దిక్కు అయిన బచ్చా మేస్త్రి.

  • మృతదేహాన్ని తన ఇంటిలో పెట్టుకొని అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్న మేస్త్రి

  • చెక్క సెంట్రింగ్ పని చేస్తూ, ఆటో నడుపుతూ సేవా కార్యక్రమాలు చేస్తున్న మేస్త్రి

  • సొంత ఖర్చులతో మతదేహానికి అంతిమ సంస్కరాలు నిర్వహిస్తున్న మేస్త్రి

  • రీడింగ్ రూం ఏర్పాటు చేసిన బచ్చా మేస్త్రి

  • పేద విద్యార్ధులకు స్కూల్ ఫీజు కడుతూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న మేస్త్రి

 

          కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం.. ప్రాణమున్న మనిషినే పట్టించుకోని లోకంలో... ప్రాణం విడిచిన దేహాన్ని ఎవరు చేరదీస్తారు ? అయినవారు కూడా చేయలేని సేవను ఒక సాధారణ మేస్త్రి చేసి చూపిస్తున్నాడు. ఆఖరి మజిలీలో అండగా ఉంటున్నాడు. బతికినంతకాలం నలుగురికి సేవ చేస్తూ  ఆ నలుగురిలో ఒకడు కావాలన్నదే అతడి ఆశ. ఇంతకీ అతను ఏ బడా వ్యాపారో.. కార్పొరేటరో కాదు.. సామాన్య సెంట్రింగ్ మేస్త్రి ఉరఫ్ బచ్చా మేస్త్రి.

         ఇదిగో ఈ ఆటో నడుపుతున్న వ్యక్తి విజయవాడ మధురానగర్ లో ఉండే కాలేషా. ఎలియాస్ బచ్చా మేస్త్రి. వృత్తి చక్క సెంట్రింగ్ పని. ఏ దిక్కూ లేని వారికి ఆయనే పెద్దదిక్కు. మనిషి చనిపోయాక శవాన్ని సొంతింట్లో పెట్టడానికే ఆలోచించే ఈ లోకంలో అద్దె ఇళ్ళ పరిస్ధితి ఏమిటి ? విజయవాడ నగరంలో మరి అద్దెకున్న వారి అంతిమ సంస్కారాల మాటేమిటి ? అలాంటి వారికి అతనో ఆపద్భాంధవుడు. 60 ఏళ్లు మీద పడినా... సేవ చేయడానికి మాత్రం అతను పరుగులు పెడతాడు.

          ఇక్కడ ఆటో నడుపుతున్న విజువల్స్ (స్లో మోషన్ లో వేసి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్... అంకురం సినిమాలోని ఎవరో ఒకరు... ఎప్పుడోకపుడు పాట మ్యూజిక్ ఆటో నడుపుతున్నప్పు పడాలి).ఎక్కువ శాతం వేరే ప్రాంతాల నుంచి వలస వచ్చి అద్దె ఇళ్లల్లో జీవనం సాగించే పరిస్ధితి  విజయవాడ నగరంలో  ఉంటుంది. ఇక ఈ పరిస్ధితుల్లో ఎవరైనా చనిపోతే వారి ఇంటి ఛాయలకు కూడా ఎవరూ రానివ్వరు. ఆసుపత్రిలో చనిపోయినట్లయితే అటునుంచి అటే స్వర్గపురికి తరలించి అంతిమ సంస్కరాలు పూర్తి చేయాల్సిన పరిస్ధితి. శవం ఎదురైతే అశుభంగా భావించే మనుషులున్న ప్రస్తుత ప్రపంచంలో...  ఎవరి ఇంటివద్దనైనా మృతదేహం పెట్టుకోవడానికి చోటు లేకపోతే.... తన ఇంటి దగ్గరే పెటుకొనే గొప్ప మానవతావాది కాలేషా.

             చనిపోయిన వ్యక్తిని ఆఖరి చూపులు చూసేందుకు బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు రావడానికి కనీసం 24 గంటల సమయం పడతుంది. ఆ 24 గంటలు శవాన్ని ఎక్కడ పెట్టుకోవాలి ? ఎవరు పెట్టుకోనిస్తారు ? అలాంటి సమస్య ఎదురైతే ఒక్క ఫోన్ చేస్తే చాలు తన స్వంత వాహనాన్ని తీసుకొచ్చి అక్కడినుంచి మృతదేహాన్ని తన ఇంటికి తీసుకువెళ్లిపోతాడు కాలేషా.... రూపాయి తీసుకోకుండా సంప్రదాయబద్ధంగా ఆ మతదేహానికి వారి వారి సంప్రదాయాల ప్రకారం కర్మకాండలు జరిపిస్తాడు. గత పదేళ్లగా కాలేషా తన సేవలందిస్తూనే ఉన్నాడు.

           ఇదే కాకుండా తన సొంత ఖర్చులతో మధురానగర్ లో ఒక రీడింగ్ రూం ఏర్పాటు చేసి విద్యార్ధులకు, పెద్దలకు పఠనాశక్తిని పెంచుతున్నాడు. పేద విద్యార్ధులకు స్కూల్ ఫీజు కడుతూ వాళ్ల బంగారు భవితక బాటలు వేయడానికి తనవంతు సాయం అందిస్తున్నాడు.

            ఒక చెక్క సెంట్రింగ్ పని చేసే వ్యక్తి ఇంత దాతృత్వం ప్రదర్శిస్తుంటే... లక్షలు.. కోట్లు కూడబెట్టిన ధనవంతులు మనసు పెడితే ఇంకెన్ని సేవలు చేయోచ్చు అన్న ప్రశ్న ఇక్కడ ఎవరికి వారు వేసుకోవాలి. సేవ చేయాలి అంటే డబ్బే కాదు అంతకు మించిన మనసు ఉండాలని బచ్చా మేస్త్రి నిరూపిస్తున్నారు.

people
DEATH
Birth
Helping People
People News
People updates
People Latests
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Helping To People By bacha Mastry

YOU MAY LIKE