బాబోయ్ ఏనుగులు..!

Submitted by ganesh on Thu, 12/06/2018 - 12:19
బాబోయ్ ఏనుగులు..!

                  జూలో ఏనుగును అల్లంత దూరం నుంచి చూస్తేను ఒళ్లు గగ్గుర్పొడుస్తుంది... దాని ఘీంకారం వింటేనే భయం వేస్తుంది. అలాంటి ఏనుగులను అడుగు దూరంలో చూస్తే అంతే.. ప్రస్తుతం విజయనగరం జిల్లా వాసుల పరిస్థితి ఇలానే ఉంది. అడవి నుంచి వచ్చే  ఏనుగుల గుంపు గ్రామ వాసులను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి

                   జూ లో ఏనుగును అల్లంత దూరం నుంచి చూస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది... దాని ఘీంకారం వింటే నే భయం వేస్తుంది. అలాంటి ఏనుగులను అడుగు దూరంలో చూస్తే ..  అది కూడా అడవి ఏనుగులను. విజయనగరం జిల్లా వాసులకు ప్రస్తుతం ఇదే పరిస్థితి ఎదురైంది. అడవి నుంచి వచ్చిన ఏనుగుల గుంపు గ్రామ వాసులను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. దాదాపు 7 ఏనుగులు గుంపు గ్రామాల్లో తిరుగుతూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తమ గ్రామం విడిచి ఎప్పుడు వెళ్లిపోతాయి అని ఎదురుచూస్తున్నారు.

                   విజయనగరం జిల్లా , జియ్యం వలస, గరుగుబిల్లి గ్రామాల మధ్యలో ఏనుగుల గుంపు సంచరిస్తున్నాయి. గత మూడు నెలల నుంచి గ్రామాన్ని విడిచిపెట్టకుండా తిరుగుతున్నాయి. చెరుకు తోటలు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండడం తో ఆహారం సులువుగా దొరుకుతోంది. కాబట్టి ఈ ప్రాంతం విడిచి వెళ్లేందుకు ఏనుగులు ఇష్టపడడం లేదు. వాటిని తరిమేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. బాణసంచా కాల్చి వాటిని దారి మళ్లించి అడవుల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏనుగులు మాత్రం ఏ భయం లేకుండా ఉన్న చోటు నుంచి కదలడం లేద. విశాలంగా ఉండే చెరుకు తోటల నుంచి బయటకు రావడం లేదు. ఉదయం అంతా తోటల్లో ఉంటున్న ఏనుగులు రాత్రి సమయంలో ప్రయాణిస్తాయి. జియ్యంవలస నుంచి చిన్నకోదురు మీదుగా వచ్చిన ఏనుగులు ప్రస్తుతం ఖడ్గవలస గ్రామంలో తిష్ట వేసుకుని కూర్చున్నాయి. వందల ఎకరాల చెరుకు తోటను ధ్వంసం చేస్తున్నాయి . ఎప్పుడూ ఎటునుంచి ఏనుగు తమ మీద దాడి చేస్తుందోనని గ్రామస్థులు భయపడుతున్నారు. సరిగ్గా పంట చేతికొచ్చే సమయానికి ఏనుగులు గుంపు రావడంతో రైతులు లబోదిబోమంటున్నారు...

                       ఏనుగులు అడవులను వదిలి జనారణ్యంలో కి  రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏ జంతువు అయినా జనాల మధ్యలోకి వచ్చేది ఆహారం, నీరు కోసమే. విజయనగరం చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కువగా ఉన్నది ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి. అడవి ప్రాంతం తక్కువ, కొండ ప్రాంతం ఎక్కువగా ఉన్నాయంటున్నారు కురుపాం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మురళీకృష్ణఅంత ఎత్తులో ఏనుగులకు సరైన ఆహారం., నీరు లభించడం లేదు. పైగా జంతువులు ఎత్తు ప్రాంతాలకు వెళ్ళడానికి ఇష్టపడవు. అందుకే అడవలకు దగ్గరగా ఉన్న గ్రామాలు, మైదానం ప్రాంతాలకు వస్తున్నాయి. ఇప్పుడు వచ్చిన ఈ ఏనుగుల గుంపు లో ఒక చిన్న ఏనుగు పిల్ల కూడా ఉంది. కాబట్టి ఆహారం సమృద్దిగా, సులువుగా దొరికే ఈ ప్రాంతంలోనే ఏనుగులు మకాం వేశాయి. మూడు నెలల క్రితం గ్రామాల్లోకి వచ్చిన ఏనుగుల గుంపును ఒడిశా అడవుల్లోకి దారి మళ్లించేందుకు ప్రయత్నించారు. అయితే అనుకొని కారణాల వలన ఏనుగులు మళ్లీ గ్రామాల్లోకి వచ్చేశాయి. గతంలో 2007 లో ఇదే ప్రాంతంలో వచ్చిన ఏనుగు గుంపును ఆపరేషన్ గజ పేరుతో ప్రత్యేక పద్దతుల్లో ఇక్కడ నుంచి తరిమేశారు. అయితే ఈ ఏనుగులు మాత్రం అంత వైల్డ్ గా లేవని, కొంచెం శాంతంగా ప్రవర్తిస్తాయి అని రేంజ్ ఆఫీసర్ చెబుతున్నారు.

                      ఏనుగుల దాడిలో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే చాలా మందికి ఇప్పటికీ పరిహారం అందలేదని వాపోతున్నారు. వీలైనంత త్వరగా ఏనుగుల నుంచి తమను, తమ పంటను రక్షించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు

Huge Of Elephants
Farmers
Farmers News
Elephants
Elephants Hulchul
elephants hulchul in ap
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Huge Of Elephants

YOU MAY LIKE