మల్టీస్టారర్ మూవీ పై  ఉత్కంఠ...

Submitted by ganesh on Thu, 11/01/2018 - 17:22
మల్టీస్టారర్ మూవీ పై  ఉత్కంఠ

                  టాలీవుడ్ లో యంగ్ టైగర్  ,చెర్రి కాంబోలో తెరకెక్కె మల్టీస్టారర్ మూవి పై ఉత్కంఠ కంటిన్యూ అవుతునే ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రలు సినిమాలో ఎలా ఉండబోతున్నాయి? వారి గెటప్స్ ఏమిటి? అనే విషయంలో క్యూరియాసిటీ పీక్స్ కి చెరింది.అయితే ఇదే విషయంలో ఫీల్మ్ నగర్ లో కొత్త టాక్ ఊపందుకుంది. ఈ సినిమాలో చెర్రి ,తారక్ ల గెటప్స్ ఇవే అంటూ ఓ వార్త హల్ చల్ చేస్తుంది.ఇంతకి ఇందులో నిజమేంత?.ఇప్పుడు చూద్దాం.

                     టాలీవుడ్ లో రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కనున్న మల్టీస్టారర్ మూవీ పై  ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ సినిమాకి  సంబంధించి ఏ విషయం బయటకు పొక్కకుండా చిత్ర బృందం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రలు సినిమాలో ఎలా ఉండబోతున్నాయి? వారి గెటప్స్ ఏమిటి? అనే విషయంలో క్యూరియాసిటీ  హై రేంజిలో ఉండగా.... తాజాగా ఓ ఆసక్తికర కథ ప్రచారంలోకి వచ్చింది. అందులోని విషయాలు అభిమానుల్లో హై ఓల్టెజ్ పుట్టిస్తున్నాయ్.

                     ఈ సినిమా బ్యాక్‌ డ్రాప్ విషయానికొస్తే... 1920 నాటి కథాంశంతో ఈ సినిమా ఉండబోతోందని, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగే పోరాటం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని  ఇందులో దేశ భక్తులుగా చరణ్, ఎన్టీఆర్ కనిపించబోతున్నారట.బ్రిటిష్ వారి సంపదను కొల్లగొట్టే దొంగ పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తాడని  బ్రిటిష్ వారిని ముప్పతిప్పలు పెడుతూ మూడు చెరువుల నీళ్లుతాగించే రేంజిలో యంగ్ టైగర్ రోల్ ఉంటుందని టాక్.ఇక చెర్రి విషయనికి వస్తే బ్రిటిష్ ప్రభుత్వంలో పని చేసే పోలీస్ పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తాడని, బ్రిటిష్ వారి తరుపున పని చేస్తు నరనరాల్లో దేశ భక్తితో ఉండే పాత్రలో మెగా పవర్ స్టార్ కనిపించబోతున్నడని టాక్.

                       మొత్తనికి 300 కోట్ల భారీ బడ్జెట్‌తో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బడ్జెట్ ఈ రేంజిలో ఉందంటే సినిమా ఏ రేంజిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టోరీ సైతం ప్రేక్షకులు థ్రిల్ అయ్యేలా ఉంటుందని, కల్పిత కథే అయినా స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన అంశాలు అద్భుతంగా ఉంటాయని టాక్.ప్రజంట్ ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అప్పటి కాలానికి సంబంధించి సెట్స్ గండిపేట ప్రాంతంలో నిర్మిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మేజర్ షెడ్యూల్ ఇక్కడే జరుగనుంది.మరి ఈ సినిమాతో రాజమోళి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో వెచి చూడాల్సిందే.

RAJAMOULI
RajaMouli News
Rajamouli Updates
Rajamouli Update News
RajaMouli Breakings
Rajamouli Breaking News
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Huge Waiting For MultiStar Movie

YOU MAY LIKE