నాలుగో వన్డేలో భారత్ ఘన విజయం

Submitted by Likhitha on Tue, 10/30/2018 - 08:54
నాలుగో వన్డేలో భారత్ ఘన విజయం

                       విండీస్‌తో జరిగిన నాలుగో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఐదు వన్డేల సిరీస్‌ లో 2-1 ఆధిక్యంతో ముందుకు దూసుకెళ్లింది. ముంబై వేదికగా జరిగిన నాలుగో వన్డేలో కోహ్లీ సేన 224 పరుగుల తేడాతో భారీ విజయం నమోదుచేసింది. 378 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్...కేవలం 153 పరుగులకే ఆలౌటైంది. 

                      ముంబై వేదికగా జరిగిన భారత్ – వెస్టిండీస్ నాలుగో వన్డే పూర్తి ఏకపక్షంగా సాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా రోహిత్ శర్మ, అంబటి రాయుడు సెంచరీలతో 377 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది. భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన వెస్టిండీస్ టీమ్... భారత్ బౌలర్ల ధాటికి పేకమేడలా కూలి కేవలం 153 పరుగులకే ఆలౌటైంది. 

                      బ్రబౌర్న్  స్టేడియంలో జరిగిన నాలుగో వన్డేలో భారత్ 224 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్  గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ పరుగులతో స్టేడియాన్ని హోరెత్తించింది. ఓపెనర్  రోహిత్ శర్మ, అంబటి రాయుడు సెంచరీలతో చెలరేగిపోయారు. శిఖర్ ధవన్ 38, విరాట్ కోహ్లీ 16 పరుగులకే ఔటైనప్పటికీ రోహిత్ శర్మ, రాయుడు క్రీజులో నిలదొక్కుకుని చెలరేగిపోయారు. బౌండరీలతో హోరెత్తించారు. తొలుత రోహిత్  శర్మ సెంచరీ పూర్తి చేసుకోగా, ఆ తర్వాత కాసేపటికే రాయుడు కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కెరీర్‌ లో 21వ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్  162 పరుగుల వద్ద ఔటయ్యాడు. కెరీర్‌ లో మరోసారి 150 పరుగుల మైలురాయి దాటిన రోహిత్.... అత్యధిక సార్లు ఈ మార్కు దాటిన బ్యాట్స్ మెన్ గా రికార్డు సృష్టించాడు. నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది.

                      378 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌కు 20 పరుగుల వద్ద భారీ ఎదురుదెబ్బ తగిలింది. అదే స్కోరు వద్ద మూడు వికెట్లు కోల్పోయింది. ఇక, ఆ తర్వాత ఏ దశలోనూ విండీస్ కోలుకోలేదు. భారత బౌలర్లు ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్‌లు విండీస్‌ ను మరింత ఒత్తిడిలోకి నెట్టేశారు. చెరో మూడు వికెట్లు తీసి విండీస్ భరతం పట్టారు. 47 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన విండీస్ వంద పరుగుల్లోపే ఆలౌట్ అవుతుందని భావించారు. అయితే, కెప్టెన్ హోల్డర్ ఒంటరి పోరాటంతో స్కోరు బోర్డు ముందుకు కదిలింది. విండీస్ ఆటగాళ్లలో హోల్డర్ చేసిన 54 పరుగులే అత్యధికం. మిగిలిన వారంతా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడంతో 36.2 ఓవర్లలో 153 పరుగులకు వెస్టిండీస్ లౌటైంది. 

                    224 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన టీమిండియా 5 వన్డేల సిరీస్ లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. 162 పరుగులు సాధించిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. చివరి వన్డే నవంబర్ ఒకటిన తిరువనంతపురంలో జరగనుంది. ఈ మ్యాచ్ భారత్ గెలిస్తే సిరీస్ సొంతం అవుతుంది. విండీస్ విజయం సాధిస్తే సిరీస్ సమం అవుతుంది. చివరి వన్డే రెండు జట్లకు కీలకం కానుంది.

4th ODI
India
West Indies
India Won by 224 Runs
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
India Won by 224 Runs in 4th ODI

YOU MAY LIKE