జగన్ పై దాడి ఎన్నో అనుమానాలు

Submitted by ganesh on Fri, 11/02/2018 - 12:05
జగన్ పై దాడి ఎన్నో అనుమానాలు

                   విశాఖ ఎయిర్ పోర్టులో తనపై జరిగిన హత్యాయత్నంపై ఏపీ ప్రభుత్వం అజామాయిషీ లేని ప్రత్యేక దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణ జరిపించాలని వైసీపీ అధినేత జగన్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే కేసులో వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, గుంటూరుకు చెందిన బుర్రగడ్డ అనిల్ వేసిన పిటిషన్లతో కలిసి మూడు పిటిషన్లను వచ్చే మంగళవారం విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.. కేసు తదుపరి విచారణను మంగళవారంకు వాయిదా వేసింది ఉమ్మడి ధర్మాసనం.

                     ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పై జరిగిన హత్యాయత్నం వ్యవహారం దూమారం రేగుతోంది. మరోవైపు దాడిపై ఎన్నో అనుమానాలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఏపీ పోలీసులు ఘటనపై ఏర్పాటు చేసిన స్పషల్ ఇన్వెస్ట్ గేషన్ టీమ్ కేసు దర్యాప్తు వేగవంతం చేస్తోంది. ప్రతి విషయాన్ని సీరియస్ గా తీసుకొని సిట్ అధికారులు విచారణ చేపడుతున్నారు. మరో వైపు జగన్ పై జరిగిన హత్యాయత్నం వెను రాజకీయపరంగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా నిలిచింది. దాడి వ్యవహారం వైసీపీ నేతలతో పాటు వైఎస్ జగన్  నేరుగా ఉమ్మడి హైకోర్టు మెట్లు ఎక్కారు..

                      ఇప్పటికే  జగన్ పై జరిగిన హత్యాయత్నాన్ని థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలని వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేయగా. నేరుగా వైఎస్ జగన్ హైకోర్టులో మరో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. జగన్ వేసిన పిటిషన్ లో ఎనిమిది మంది ప్రతివాదులుగా చేర్చారు.. ఇందులో ప్రతి వాదులుగా ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఏపీ ప్రిన్సిపల్ సెక్రటరీ హోం..యూనియన్ ఆఫ్ ఇండియా మినిస్టరీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఏపీ డీజీపీ, తెలంగాణ డీజీపీ, ఎయిర్ పోర్టు స్టేషన్ హౌజ్ ఆఫీసర్, సిట్ ఇంఛార్జ్ అధికారిని రెస్పాడెట్స్ గా రిట్ పిటిషన్ లో పేర్కొన్నారు..అయితే జగన్ పై జరిగిన దాడిపై దాఖలైన పిటిషన్లపై వచ్చే మంగళవారం విచారణ చేపట్టనున్నట్లు ధర్మాసనం వెల్లడించింది

                        జగన్ రిట్ పిటిషన్ లో కొన్ని కీలక అంశాలను పేర్కొన్నారు. తన దాడిపై విచారణ చేసేందుకు ఏపీ ప్రభుత్వం వేసిన దర్యాప్తు సంస్థపై తమకు నమ్మకం లేదని.. కేంద్ర సంస్థల ద్వారా దర్యాప్తు చేయాలని పేర్కొన్నారు. జగన్ పై హత్యాయత్నం జరిగిన గంటలోపే ఏపీ సీఎం చంద్రబాబు, డీజీపీ స్పందించిన తీరు అనుమానాలు ఉన్నాయని వాటిపై కూడా పూర్తి  స్థాయి విచారణ చేయాలంటూ పేర్కొన్నారు..ఆపరేషన్ గరుడ అనే విషయాని సీఎంతో టీడీపీ నేతలు అంటున్న విషయంపై ఎలాంటి సంబంధం లేదని దానిపై కూడా విచారణ చేయాలని కోరుతున్నట్లు జగన్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోరారు.. జగన్ దాడిపై దాఖలైనా మూడు పిటిషన్లను కలిపి వచ్చే మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు..

                       సంచలనంగా మారిన జగన్ దాడి కేసుకు సంభంధించిన వ్యవహారంలో అధికార టీడిపి ప్రతిపక్ష వైసిపి నేతల మధ్య మాటల దాడి జరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

ys jagan
ys Jagan updates
YS Jagan Court Enquiry
YS Jagan in CBI Court
YS Jagan Press Meet
ys jagan news
YS jagan latest news
YS Jagan Latest updates
YSRCP Latest News
ysrcp news
YS Jagan Announcement
YS Jagan Padayatra
YSRCP Padayatra
YS Jagan Fires
YS Jagan Comments
YSRCP Fires
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Jagan Had lot of Doubts

YOU MAY LIKE