కాకినాడ సెజ్ ఉద్యమం...

Submitted by ganesh on Wed, 12/05/2018 - 17:29
కాకినాడ సెజ్ ఉద్యమం...

                   పోలీసుల అత్యుత్సాహం కాకినాడ సెజ్  రైతుల పాలిట శాపంగా మారింది... ఆరు సంవత్సరాల క్రితం కేసులను బయటకు తీసి  రైతులను అరెస్టు చేస్తు సెజ్ ఉద్యమం పై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు..  కోసిన వరి పంట సాక్షిగా పొలంలో పనులు చేస్తున్న రైతును బలవంతంగా అరెస్ట్ చేసి రిమాండుకు పంపించిన సంఘటనపై అఖిలపక్షం ఆధ్వర్యంలో  సెజ్ రైతులు ఉద్యమించారు..

                   తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలంలో దశాబ్దానికి పైగా కాకినాడ సెజ్ ఉద్యమం సాగుతోంది...అందులో భాగంగా  రైతులపై అనేక కేసులు పెట్టిన పోలీసులు సెజ్ రైతును భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.. అయితే ఇప్పుడు 2014లో పెట్టిన కేసు నిమిత్తం రామరాఘవ పురం గ్రామానికి చెందిన పెకేటి త్రిమూర్తులు అనే రైతును పొలాల్లో పని చేస్తుండగా పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.. దానితో అఖిలపక్షం ఆధ్వర్యంలో సెజ్ వ్యతిరేక పోరాట కమిటి  తాహసీల్దార్ కార్యాలయం,  పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. త్రిమూర్తులను విడుదల చేయాలని, పోలీసుజం నశించాలంటూ నినదించారు.. అనంతరం కొత్తపల్లి తాహసీల్దార్  కె.రత్నకుమారికి రైతు త్రిమూర్తులును పోలీసులు  అరెస్ట్ చేసిన తీరుకు సంబంధించిన వీడియోలు చూపించారు.. త్రిమూర్తులును విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.. అలాగే కొత్తపల్లి ఎస్సై కృష్ణమాచారికి త్రిమూర్తులను విడుదల చేయాలని వినతి పత్రాలు అందజేశారు. తన భర్తను విడుదల చేసేవరుకు పోలీస్ స్టేషన్ నుంచి కదిలేది లేదంటూ  ఎస్ఐ గదిలో గంగా కామేశ్వరి బంధువులతో సహా బైఠాయించారు.

                       జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సెజ్ బాధితులు తో ముఖాముఖి నిర్వహించిన సమయంలో త్రిమూర్తులు భార్య  గంగా కామేశ్వరి,  సెజ్ వల్ల జరుగుతున్న అన్యాయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లింది ఈ కారణంగానే అక్రమ అరెస్ట్ జరిగిందని  జనసేన నాయకులు ఆరోపించారు..

                       అలాగే వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు సెజ్ బాధితులకు అండగా ఉంటూ, ఏ కష్టం వచ్చినా ముందుండి పోరాడుతామని వైసీపీ నేత గండేపల్లి బాబి అంటున్నారు. 2014 సంవత్సరంలో సెజ్ ఉద్యమంలో భాగంగా వంటావార్పు కార్యక్రమంలో పోలీస్ వాహనం పై జరిగిన   దాడి ఘటనలో ఏ వన్ ముద్దాయిగా త్రిమూర్తులు ఉన్నారని..  విచారణ అనంతరం ఆయన్ని సక్రమంగానే అరెస్టు చేశామని ఎసై కృష్ణమాచారి పేర్కొన్నారు..

                        ప్రభుత్వాలు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి రైతులను ఇలా భయబ్రాంతులను చేయాడాన్ని ఎవ్వరు అంగీకరించరు. ఎప్పుడో 2014 నాటి కేసును విచారణ ఇప్పుడు విచారణ చేసి అరెస్ట్ చేశామనడం ఎంత వరకు సమంజసమో పోలీసులే చెప్పాలి. అధికూడా పోలీసు వాహనంపై జరిగిన దాడి కేసు విచారణకు ఇంత కాలం పట్టిందా అంటూ స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

SEZ Movement
SEZ Movement News
Police
kakinada
SEZ Movement Latests
SEZ Movement Latest News
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Kakinada SEZ Movement ...

YOU MAY LIKE