కర్ణాటకలో కొనసాగుతున్న ఉపఎన్నికల కౌంటింగ్

Submitted by Likhitha on Tue, 11/06/2018 - 10:44
కర్ణాటకలో కొనసాగుతున్న ఉపఎన్నికల కౌంటింగ్

                    కర్ణాటకలో మూడు లోక్‌సభ, రెండు అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. శివమొగ్గ, బళ్లారి, మాండ్య లోక్‌ సభ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. రామనగరం, జమ్‌ ఖండి అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్‌ కొనసాగుతోంది. కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి ఆధిక్యం కనబరుస్తోంది. బళ్లారి లోక్‌ సభ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఉగ్రప్ప లక్ష ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. శివమొగ్గ లోక్‌ సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి రాఘవేంద్ర 6వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మాండ్య లోక్‌ సభ స్థానంలో జేడీఎస్‌ ఆధిక్యంలో ఉంది. జమ్‌ ఖండి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆనంద్‌ సిద్ధు ముందంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి కులకర్ణి శ్రీకాంత్‌ పై 55వేల ఓట్ల ఆధిక్యంలో ఆనంద్‌ సిద్ధు ఉన్నారు. రామనగరం అసెంబ్లీ స్థానంలో జేడీఎస్‌ అభ్యర్థి అనిత కుమారస్వామి స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తున్నారు.

KARNATAKA
by elections
Counting
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
Karnataka By Elections Counting

YOU MAY LIKE