బిజెపికి ఈ షాక్ ఊహించలేదా..?

Submitted by venkateshgullapally on Tue, 11/06/2018 - 14:24
బిజెపికి ఈ షాక్ ఊహించలేదా..?

కర్ణాటకలో జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపికి గట్టి షాక్ తగిలింది. జెడిఎస్ కాంగ్రెస్ కూటమి అక్కడ ఘన విజయం సాధించి ఆ పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది. గత ఎన్నికల్లో గెలిచిన స్థానాలను కూడా ఈసారి బిజెపి కోల్పోయింది. కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి నాలుగు చోట్ల విజయం సాధించగా బిజెపి ఒక్క స్థానంలోనే విజయం సాధించింది. రామనగర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జేడీఎస్‌ అభ్యర్థి, ముఖ్యమంత్రి కుమారస్వామి సతీమణి అనిత కుమారస్వామి భారి మెజారిటీ తో విజయం సాధించారు. బళ్లారి లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. శివమొగ్గలో భాజపా అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తనయుడు రాఘవేంద్ర విజయం సాధించారు. జమఖండీలో కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే సిద్ధు న్యామగౌడ కుమారుడు ఆనంద్‌ విజయం సాధించారు. దీనితో ఇప్పుడు బిజెపి అధిష్టానం కూడా సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో అనే ఆందోళనలో పడిపోయింది.

KARNATAKA
BJP
shock
win
Congress
JDS
karnataka shock to bjp

YOU MAY LIKE