కార్తీక బ్రహ్మోత్సవాల్లో...

Submitted by ganesh on Wed, 12/05/2018 - 12:21
కార్తీక బ్రహ్మోత్సవాల్లో...

                  అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి తిరుచానూరులో కొలువైన లోకమాత శ్రీపద్మావతి అమ్మవారి వార్సిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహనంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి బ్రహ్మోత్సవాలకు వృశ్చిక లఘ్నంలో ధ్వజస్థంభంపై సకల దేవతలను ఆహ్వానిస్తూ, గజపటాన్ని ఎగురవేసి ధ్వజారోహణం నిర్వహించారు.

                  సిరులు కురిపించే శ్రీపద్మావతి అమ్మవారు తిరుచానూరులో కొలువై భక్తజనకోటికి దర్శనమిస్తున్నారు. కలియుగప్రత్యక్షదైవం వెంకటేశ్వర స్వామి హృదయదేవేరిగా స్థానమాచరించి భక్తజను కటాక్షిస్తున్నారు. ప్రతిఏటా ఘనంగా నిర్వహించే కార్తీక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా ధ్వజారోహణంతో ప్రారంభం చేశారు. తొమ్మిదిరోజులు పాటు నిర్విఘ్నంగా సాగే ఈ బ్రహ్మోత్సవాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది.

                చినశేష వాహానం బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు సాయంత్రం అమ్మవారు శ్రీమహాలక్ష్మీ రూపిణిగా చినశేషవాహానం పై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. చినశేష వాహనంపై అమ్మవారిని దర్శించుకుంటే యోగసిద్ది కలుగుతుందని భక్తుల విశ్వాసం.

                 కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు శ్రీపద్మావతి అమ్మవారు పెదశేష వాహనంపై ఊరేగారు. లక్ష్మీ సహితుడైన శ్రీవారికి దాసుడైన పెదశేషుడి వాహనంపై అమ్మవారు ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. పట్టమహిషి అలివేలు మంగకు వాహానమై... దాస్యభక్తిని తెలియజేస్తూ సర్పరాజైన శేషుని వాహానసేవలో సేద తీరిన అమ్మవారిని దర్శించినా... యోగసిద్ది కల్గుతుందని భక్తుల నమ్మకం.

                 కార్తీక బ్రహ్మోత్సవాలు రెండో రోజు సాయంత్రం శ్రీ పద్మావతి అమ్మవారు హంసవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. హంసకు ఉన్న విశిష్ట విలక్షణాలు, నీళ్లు, పాలు వేరు చేయడం వంటి మహోన్నత లక్షణం కల్గిన హంస వాహనంపై సరస్వతీ రూపిణిగా వేంచేసిన అమ్మవారిని దర్శించినవారికి శుభాలు కలుగుతాయని, విద్యాధికులు అవుతారని భక్తుల నమ్మకం.

                తొమ్మిది రోజుల పాటు జరిగే శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి... వివిధ వాహన సేవలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించి తరిస్తారు..

Karthika Brahmotsavas
Karthika Brahmotsavas News
Sri Padmavathi Ammavari Brahmotsavam
Sri Padmavathi Ammavari Brahmotsavam News
Sri Padmavathi Ammavari Brahmotsavam Breakings
Sri Padmavathi Ammavari Brahmotsavam Breaking News
Sri Padmavathi Ammavari Brahmotsavam Latests
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
In Karthika Brahmotsavas...

YOU MAY LIKE