చచ్చేలా ఉన్నాడు అనుకుంట..?

Submitted by venkateshgullapally on Tue, 10/09/2018 - 13:36
చచ్చేలా ఉన్నాడు అనుకుంట..?

ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ అధినేత మసూద్‌ అజహర్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందా..? అంటే అవుననే అంటున్నాయి భారత నిఘా వర్గాలు. 2001లో పార్లమెంట్‌పై జరిగిన దాడి, 2005లో అయోధ్య దాడి, 2016లో పఠాన్‌కోట్‌ ఉగ్రదాడుల సహా భారత్‌లో ఎన్నో ఉగ్రదాడుల వెనుక ప్రధాన సూత్రధారిగా ఉన్న ఈ ఉగ్రవాది.. ప్రస్తుతం వెన్నెముక, మూత్రపిండాల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడని దీనితో గత కొన్ని రోజులుగా మంచానికే పరిమితమయ్యాడని భారత నిఘా వర్గాలు అంటున్నాయి.

ఈ మేరకు ఒక అధికారి వివరాలు వెల్లడించారు. ‘రావల్పిండిలోని ఓ మిలటరీ ఆస్పత్రిలో మసూద్‌ చికిత్స పొందుతున్నాడు. అతను ఏడాదిన్నర నుంచి మంచానికే పరిమితమయ్యాడని వివరించారు. అలాగే మరో అధికారి గత కొన్ని రోజులుగా స్వగ్రామమైన భవల్‌పూర్‌లోగానీ, పాకిస్థాన్‌లోని ఇతర ప్రాంతాల్లో గానీ మసూద్‌ కనిపించడం లేదని పేర్కొన్నారు. మసూద్ అనారోగ్యంతో భారత్‌, అఫ్గనిస్థాన్‌లలో జిహాదీ దాడులను అతని సోదరులు రాఫ్‌ అస్గర్‌, అత్తర్‌ ఇబ్రహీం పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తుంది. కాగా 1997 లో ఒక విమానం ఉగ్రవాదులు హైజాక్ చేసి అతనిని విడిపించుకున్న సంగతి తెలిసిందే.

moulana azahar
Pakistan
India
latest news about maoulana ajar

YOU MAY LIKE