సముద్రంలో కుప్పకూలిన విమానం

Submitted by Likhitha on Mon, 10/29/2018 - 12:37
సముద్రంలో కుప్పకూలిన విమానం

               ఇండోనేషియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. జకార్తా నుంచి పంగకల్ పినాంగ్ వెళ్తున్న లయన్ ఎయిర్ విమానం సముద్రంలో కూలింది. ఈ ఉదయం 6.20 గంటలకు జకార్తా విమానాశ్రయం నుంచి 181 మంది ప్రయాణికులు,ఇద్దరు పైలట్లు, ఐదుగురు సిబ్బందితో లయన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం సుమత్ర దీవుల్లోని పంగ్కల్‌ పినాంగ్‌కు బయల్దేరింది. టేకాఫ్ అయిన 13 నిముషాలకే విమానానికి ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. ఈ ఘటనపై తక్షణమే అధికారులు స్పందించి విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అదృశ్యమైన కొద్దిసేపటికే  విమానం జావా సముద్రంలో కుప్పకూలిపోయినట్లు అధికారులు గుర్తించారు. సముద్ర తీరానికి కొద్ది దూరంలోనే విమానం కూలినట్లు తెలుస్తోంది. 

indonesia
plane crash
Lion Air Crash
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
Lion Air Plane Crash

YOU MAY LIKE