తుది దశకు చేరిన అభ్యర్ధుల జాబితా...

Submitted by ganesh on Thu, 11/08/2018 - 20:06
తుది దశకు చేరిన అభ్యర్ధుల జాబితా

                     కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల జాబితా తుది దశకు చేరుకుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో 9 స్ధానాలకు గానూ 7 స్ధానాల నుంచి కాంగ్రెస్ పోటీ చేస్తుందనేది ప్రచారంలో ఉంది. మహాకూటమి భాగస్వామ్య పార్టీలు 2 స్ధానాలు కోరుకుంటున్నాయి. కామారెడ్డి నుంచి శాసన మండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, బోధన్ నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిలపై ఎలాంటి పోటీ లేకపోవడంతో వారి పేర్ల ఖరారుకు అడ్డంకులు తొలగిపోయాయి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలపై కాంగ్రెస్ వార్ రూమ్లో చర్చించనున్నారు.  

                       ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సామాజిక వర్గాల వారీగా అభ్యర్ధుల ఎంపికపై కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలోని మున్నూర్ ప్రాంతంలో కాపుల ప్రభావం అధికంగా ఉండటంతో అర్ముర్, బాన్స్ వాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో.... ఇదే సామాజిక వర్గానికి చెందిన నేతలు టికెట్ రేసులో ఉన్నారు. ఇకపోతే ఎల్లారెడ్డి, రూరల్ రెండు నియోజకవర్గాలకు పోటీ తీవ్రంగా ఉంది. నల్లమడుగు సురేందర్, సుభాష్ రెడ్డి లతో పాటు ఎర్రబెల్లి దయాకరరావు అల్లుడు... కాంగ్రెస్ ఐటీ సెల్ ఛైర్మన్ గా ఉన్న మదన్మోహన్ రావు పేరు కూడా పరిశీలనలోకి రావడంతో తీవ్ర ఆసక్తి నెలకొంది.

                         ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఆకుల లలిత పేరు దాదాపు ఖరారు అవుతుందని ప్రచారంలో ఉంది.  జుక్కల్ ఎస్సీ రిజర్వ్డ్ స్ధానం నుండి మాజీ ఎమ్మెల్యేలు గంగారాం, అరుణతార రేస్ లో ఉన్నారు. వీరిలో ఎవరికి టిక్కెట్ ఇచ్చినా... మరొకరు ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. బాన్సువాడ నియోజకవర్గంలో ఇద్దరు నేతలు కాసుల బాలరాజు, మాల్యాద్రి రెడ్డిలు బరిలో ఉండగా... కాసుల బాలరాజు పేరు దాదాపు ఖరారు అయినట్లు సమాచారం.  నిజామాబాద్ అర్బనుంచి మహేష్ కుమార్ గౌడ్ తో పాటు డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హండాన్ పేర్లను పరిశీలిస్తుండగా...  ఇటీవల కాంగ్రెస్ లో చేరిన రేవంత్ బ్యాచ్కు చెందిన మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది.

                          అయితే నిజామాబాద్ రూరల్ నుంచి మహాకూటమి తరుపున టీడీపీ కానీ టీజేఎస్ కానీ సీటు ఇవ్వాలని కోరుతున్నాయి. పొత్తులో భాగంగా బాల్కొండను భాగస్వామ్య పక్షాలకు ఇస్తారా లేక కాంగ్రెస్ పోటీ చేస్తుందా అనేది తేలాల్సి ఉంది. టీడీపీ నుండి ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ తనయుడు ఏలేటి మల్లికార్జునరెడ్డి రేసులో ఉన్నారు.

                          టీజేఎస్ పార్టీ ఎల్లారెడ్డి, నిజామాబాద్ అర్బన్, ఆశిస్తూ ఉండగా.... టీడీపీ బాల్కొండ, నిజామాబాద్ రూరల్ స్ధానాన్ని ఆశిస్తున్నాయి. ప్రస్తుతం నిజామాబాద్ నేతలు ఢిల్లీలో మకాం వేశారు. అస్సలు కాంగ్రెస్ వార్ రూమ్లో ఎం జరుగుతుందో అనే ఉత్కంఠ మాత్రం నెలకొంది. నిజామాబాద్లో ద్వితియ  శ్రేణి నేతలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

CONGRESS Leaders
CONGRESS leaders Fire
CONGRESS Leaders Comments
CONGRESS leaders Sensational Comments
CONGRESS Leaders Fires
CONGRESS Leaders Start Devlopment Works
Intintiki CONGRESS
Congress
CONGRESS Updates
CONGRESS Latest updates
CONGRESS Tour
CONGRESS Press Meet
CONGRESS News
CONGRESS Latest News
CONGRESS Latest updates
CONGRESS Announcement
CONGRESS Padayatra
CONGRESS Fires
CONGRESS Comments
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
List of candidates have reached to final stage

YOU MAY LIKE